సన్య మల్హోత్రా స్టన్నింగ్ లెదర్ కోట్ లుక్
సన్యా మల్హోత్రా నేటితరంలో బాలీవుడ్‌లో హాటెస్ట్ టాలెంట్ అన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2024 4:04 AM GMTసన్యా మల్హోత్రా నేటితరంలో బాలీవుడ్‌లో హాటెస్ట్ టాలెంట్ అన్న సంగతి తెలిసిందే. తన అద్భుతమైన నటప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణిగా ఎదిగింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం `దంగల్`తో సన్య కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో సన్య రెజ్లర్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి నుండి బదాయి హో, కథల్, జవాన్ సహా విభిన్న చిత్రాలలో అద్భుత పాత్రల్లో నటించి మెప్పించింది.
సినిమాయేతర నేపథ్యం నుండి వచ్చినా కానీ, సన్యా పరిశ్రమలో తనకంటూ ఒక పవర్‌హౌస్ పెర్ఫామర్‌గా స్థిరపడింది. వరుసగా అద్భుతమైన ప్రదర్శనలతో తన పరిధిని విస్తరించింది. సన్య తన అభిమానులకు నిరంతర ఫోటోషూట్లతోను అన్ లిమిటెడ్ ట్రీట్ ని ఇస్తోంది. ఇప్పుడు కూడా తన స్థాయిని స్టైల్ కంటెంట్ ని ఎలివేట్ చేసే ఫోటోషూట్ తో అభిమానుల హృదయాల్లోకి ఈ భామ దూసుకెళ్లింది.
సన్య తాజా ఫోటోషూట్ ఇప్పుడు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. సాన్య మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఆల్ లెదర్ లుక్ తో తన పొడుగు కాళ్ల సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ సన్య మల్హోత్రా ఇచ్చిన ఫోజ్ ఒకటి ఇంటర్నెట్ లో గుబులు పుట్టిస్తోంది. సన్య ఈసారి ఫోటోషూట్ కోసం రకరకాల డిజైనర్ దుస్తులను ఎంపిక చేసుకుంది. వీటిలో బ్రౌన్ లెదర్ జాకెట్ లో సాన్య ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. సాన్య థై హై రూపం.. సాన్య థై స్లిట్ రూపం.. సాన్య లాంగ్ ఫ్రాక్ గెటప్.. సాన్య డిజైనర్ థండర్ షోస్ ఇలా రకరకాల కోణాల్లో ఈ ఫోటోషూట్ ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా దూసుకెళుతోంది.