సూపర్‌స్టార్ బలవంతంగా కౌగిలించుకున్నాడు.. షామా ఆరోపణ!
షామా సికిందర్ .. పరిచయం అవసరం లేదు. టెలివిజన్ షో `యే మేరీ లైఫ్ హై`తో పాపులరైంది.
By: Tupaki Desk | 23 Sep 2024 3:34 AM GMTషామా సికిందర్ .. పరిచయం అవసరం లేదు. టెలివిజన్ షో `యే మేరీ లైఫ్ హై`తో పాపులరైంది. సోషల్ మీడియాల్లో ఈ అమ్మడికి భారీ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భామ తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెనైంది. ఒక ప్రకటన షూట్ సమయంలో తనకు ఎదురైన ఒక అసౌకర్య సంఘటన గురించి బాలీవుడ్ బబుల్ తో మాట్లాడారు. సీన్ బెటర్ మెంట్ కోసం అతడు తనతో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో తెలిపారు.
అతడు నన్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించింది! తప్పుడు పద్ధతిలో కౌగిలించుకున్నారా? అని అడిగినప్పుడు షామా ఇలా చెప్పింది. నన్ను కౌగిలించుకోవడం మొదట్లో షూట్‌లో భాగం కాదు. కానీ అతడు కొన్ని కారణాల వల్ల నన్ను కౌగిలించుకోవాలని అనుకున్నాడు. మీకు తెలుసా? ఎదుటివారిలో ఉన్న వైబ్‌ని అర్థం చేసుకున్నారు కాబట్టి అతడు నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు సీన్ ని ఇంప్రూవైజ్ చేశాడు. అతడు తన భార్య నగలు నాకు వేస్తానని చెప్పాడు. అప్పుడు నేను అవసరం లేదని తిప్పికొట్టాను. అతడు నన్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ రకమైన స్పర్శతో నేను అసౌకర్యంగా ఉన్నాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటిది అనుభవించలేదు! అని తెలిపింది.
ఇది నాకు చాలా షాకింగ్ వింతగా అనిపించింది. నేను చాలా మంది వ్యక్తులతో పని చేసాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారు నన్ను ఎప్పుడూ అలా భావించలేదు. ఇది నాకు చాలా షాకింగ్ గా వింతగా ఉంది. ఆ వ్యక్తి సూపర్‌స్టార్. అతడు అలాంటి స్టంట్ ఎందుకు చేయవలసి వస్తుంది? ఇది నా జీవితంలో చాలా షాకింగ్ సంఘటన. నేను ఆ వ్యక్తిని మొదటిసారి కలిశాను. అతడికి ఒక వైఖరి ఉంది.. అతడి ఆలోచన సాధారణమైనదిగా అనిపించలేదు. నేను పెద్ద స్టార్‌ని అయినా నా జీవితంలో అతనితో కలిసి పనిచేయను! అని అన్నారు.
తనకు అవకాశాలు ఎలా తప్పిపోయాయో కూడా తెలిపింది. తన షూటింగ్ క్యాన్సిల్ అయిందని చివరి నిమిషంలో షామాకు దర్శకుడు చెప్పారట. ఒక పెద్ద సినిమా పని ప్రారంభమైంది.. షూటింగ్‌లో ఉన్నాను.. మేకప్ పూర్తి చేసుకున్నాను.. పెద్ద స్టార్ తో పని చేస్తున్నాను...కానీ నా పాత్రను వేరొకరికి ఇచ్చారని తెలిసింది. తాను వెళుతుంటే, నేను చేయాల్సిన పాత్రకు మరొకరిని తీసుకున్నారని దర్శకుడు చెప్పాడు. షాక్ అయ్యి రాత్రంతా ఏడ్చాను! అని షామా చెప్పింది. రాత్రిపూట ప్రాజెక్ట్‌ల నుండి నటీనటులను తొలగించడం వంటి సంఘటనలు చిత్ర పరిశ్రమలో సాధారణం అని తెలిపింది.