Begin typing your search above and press return to search.

శుభ‌వార్త చెప్పిన టీవీ మూవీ న‌టి షామా

టీవీ మూవీ న‌టి షామా సికంద‌ర్ నిరంత‌ర ఫోటో ట్రీట్ గురించి చెప్పాల్సిన‌ లేదు. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారులో ఫాలోయింగ్ పెంచుకుంది.

By:  Tupaki Desk   |   13 March 2025 9:06 AM IST
శుభ‌వార్త చెప్పిన టీవీ మూవీ న‌టి షామా
X

టీవీ మూవీ న‌టి షామా సికంద‌ర్ నిరంత‌ర ఫోటో ట్రీట్ గురించి చెప్పాల్సిన‌ లేదు. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారులో ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ భామ విదేశీ ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఫోటోలు వీడియోలు నిరంత‌రం అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.


తాజాగా షామా సికంద‌ర్ త‌న ఫ్రెగ్నెన్సీని ఇన్ స్టాలో అధికారికంగా ధృవీక‌రించింది. ``నేను సీరియస్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాను. నా లోపలి బిడ్డ గురించి.. సీరియస్‌గా ఉండటానికి జీవితం చాలా చిన్నది.. మనం బేబీలా ఆడుకుందాం!!!`` అంటూ జాలీ మూడ్ ని ప్ర‌దర్శించింది. మొత్తానికి టీవీ ఇండ‌స్ట్రీ రియాలిటీ క్వీన్ శుభ‌వార్త‌ను అభిమానుల‌కు అందించింది.


40 ప్ల‌స్ ఏజ్ లోను షామా గ్లామ‌ర్ షో నిరంత‌రం యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారుతోంది. టీవీ షో యే మేరీ లైఫ్ హై (2003-2005)లో పూజా మెహతా పాత్రలో న‌టిగా పాపుల‌రైంది. అమీర్ ఖాన్ `మన్ అండ్ ప్రేమ్ అగ్గన్` లలో కూడా కనిపించింది. ప‌లు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. షార్ట్ ఫిల్మ్ `సెక్సాహోలిక్`.. `మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్`తో దుమారం రేపింది. షామా నిర్మాత గానూ మారింది. షామా సికందర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ పేరుతో తన సొంత సంస్థలో సినిమాలు చేస్తోంది. ఇందులో షామా మానసిక ఆరోగ్యం గురించి `అబ్ దిల్ కి సన్` అనే షార్ట్ మూవీ సిరీస్ ను నిర్మించింది.