Begin typing your search above and press return to search.

బ్లాక్ చీర కట్టులో నీ అందానికి 'సాహో'

బాలీవుడ్‌ మూవీ తీన్‌ పత్తి తో 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌.

By:  Tupaki Desk   |   25 Sep 2024 3:30 PM GMT
బ్లాక్ చీర కట్టులో నీ అందానికి సాహో
X

బాలీవుడ్‌ మూవీ తీన్‌ పత్తి తో 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌. ఇండస్ట్రీలో నెపొ కిడ్ గా అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలా కష్టపడింది. విభిన్నమైన సినిమాలను, పాత్రలను ఎంపిక చేసుకున్న శ్రద్ధా కపూర్ స్టార్‌ హీరోలకు జోడీగా నటించి ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకుంది. కుటుంబ నేపథ్యంను వినియోగించుకోకుండా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు సౌత్‌ లోనూ మంచి ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు ప్రతి పాత్రకు కష్టపడే తత్వం కారణంగా బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది.


టాలీవుడ్‌ లో ఈ అమ్మడు యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ చేసిన సాహో సినిమాలో నటించింది. ప్రభాస్ తో ఈ అమ్మడు చేసిన రొమాన్స్ కి పాన్ ఇండియా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా తెలుగు లో హిట్‌ కాకున్నా హిందీలో కమర్షియల్ గా బిగ్‌ సక్సెస్ ను సొంతం చేసుకుంది. సాహో సినిమా తర్వాత టాలీవుడ్‌ నుంచి పలు ఆఫర్లు వచ్చినా వాటిని శ్రద్ధా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. హిందీలో ఈ అమ్మడు ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తోంది. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇటీవల స్త్రీ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.


బాలీవుడ్‌ హీరోలకు సైతం సాధ్యం కానీ భారీ వసూళ్ల ను స్త్రీ 2 తో శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది. హర్రర్‌ కాన్సెప్ట్‌ తో వచ్చిన ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు బ్లాక్‌ చీర కట్టు లో అందమైన ఫోటోలను షేర్‌ చేసిన శ్రద్ధా కపూర్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందం శ్రద్ధాకే సాధ్యం అన్నట్లుగా ఈ ఫోటోలో చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోడ్రన్‌ డ్రెస్ ల్లోనే కాకుండా చీర కట్టులోనూ ఇంత అందంగా ఉన్న శ్రద్ధా కపూర్ మళ్లీ తెలుగు లో నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


సాధారణంగా ముద్దుగుమ్మలు నడుము అందం చూపించి, థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తేనే ఆ ఫోటోలు వైరల్‌ అవుతాయి. కానీ శ్రద్ధ ఈ ఫోటోల్లో కనీసం నడుము అందం చూపించలేదు, క్లీవేజ్ షో చేయలేదు అయినా భలే ఉందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ తెగ లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువగా షేర్‌ చేసుకుంటున్నారు. స్త్రీ 2 సినిమా తర్వాత ఈ అమ్మడి స్థాయి అమాంతం పెరిగింది. పలువురు యంగ్‌ హీరోల పారితోషికం తో పోల్చితే ఈమె పారితోషికం ఎక్కువ ఉందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.