Begin typing your search above and press return to search.

బికినీలో శ్రేయా.. ఆ నవ్వుకే ఫిదా

ఈ మూవీ తర్వాత ఆమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:30 AM GMT
బికినీలో శ్రేయా.. ఆ నవ్వుకే ఫిదా
X

శ్రేయా ధన్వంతరి చాలా మందికి సోషల్ మీడియా క్రష్. నటిగా ఈ బ్యూటీ అరంగేట్రం టాలీవుడ్ లోనే అయిన ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. నటిగా ఆమెని గుర్తించింది, గుర్తింపునిచ్చింది బాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో 2009లో ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. తరువాత 2010లో ‘స్నేహగీతం’ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రేయా ధన్వంతరి నటించింది.


ఈ మూవీ తర్వాత ఆమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో నార్త్ ఇండియా వెళ్లి అక్కడ మోడలింగ్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. దీంతో ‘వై చీట్ ఇండియా’ సినిమాలో ఇమ్రాన్ హష్మీకి జోడీగా హిందీలో అవకాశం సొంతం చేసుకుంది. ‘లూప్ లుపేటా’, ‘చుప్’, ‘అన్ పాస్డ్ నయా సఫర్’, ‘అద్భుత్’ సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీస్ లో శ్రేయా ధన్వంతరి లీడ్ రోల్ చేయడం విశేషం.


అలాగే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన శ్రేయా ‘లేడీస్ రూమ్’ అనే ఇంగ్లీష్ సిరీస్ 2016లో చేసింది. తరువాత ‘ది రీయూనియన్’ అనే బెంగాలీ సిరీస్ లో కనిపించింది. ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 1 లో కీలక పాత్రలో నటించింది. చివరిగా 2024 లో ‘గన్స్ అండ్ గులాబ్స్’ సిరీస్ తో శ్రేయా ధన్వంతరి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇలా ఓ వైపు సినిమాలు, మరో వైపు సిరీస్ లతో శ్రేయా బాలీవుడ్ లో పాగా వేసింది.


నార్త్ ఇండియాలో నటిగా సెటిల్ అయిన ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రేయా ధన్వంతరి చాలా మందికి సోషల్ మీడియా క్రష్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా ఇన్ స్టాగ్రామ్ అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలని పంచుకుంది. ఈ ఫోటోలలో శ్రేయా చాలా గ్లామరస్ గా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. ఇక ఆమె నవ్వుకి ఫిదా అవ్వాల్సిందే అని మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.