Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : అందాల పులి, కిల్లింగ్ లుక్స్‌

సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తమన్నా.

By:  Tupaki Desk   |   9 Dec 2024 2:30 PM GMT
పిక్‌ టాక్‌ : అందాల పులి, కిల్లింగ్ లుక్స్‌
X

సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తమన్నా. తెలుగులో శ్రీ సినిమాతో 2005లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నిరాశ పరచినా మరో ఛాన్స్ అన్నట్లుగా శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. 2007లో విడుదల అయిన హ్యాపీ డేస్ తర్వాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోకుండా పదేళ్లు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఆహా ఓహో అనిపించే స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంది. నటనతో మెప్పించింది, డాన్స్‌తో మైమరపించింది. స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్గా తమన్నా సినిమాలు వెనక్కి తిరిగి చూడకుండా చేస్తూ వచ్చింది.


మిల్కీ బ్యూటీ తమన్నా అంటూ ట్యాగ్‌ను సొంతం చేసుకున్న తమన్నా ఈమధ్య కాలంలో కాస్త జోరు తగ్గింది. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌ హీరోయిన్‌గా మారుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తర్వత నుంచి జోరు తగ్గడం మొదలు అయ్యింది. అయితే మరో హీరోయిన్‌ అయితే ఇప్పటి వరకు కనిపించకుండా కనుమరుగు అయ్యే వారు. కానీ తమన్నా చాలా తెలివిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఐటెం సాంగ్స్, మ్యూజిక్‌ వీడియోలను సైతం వదలకుండా నటిస్తూ ఉంది.


సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం వల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తద్వారా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ ఉంది. ఆ మధ్య రజనీకాంత్‌ తో చేసిన వా కావాలయ్య పాట ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. స్త్రీ 2 సినిమాలో ఈ అమ్మడు చేసిన ఐటెం సాంగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇలా తనకు ప్రాముఖ్యత ఇచ్చే విధంగా తన ప్రతిభను చూపిస్తూనే ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా మరోసారి తన అందమైన ఫోటో షూట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి అందాల పులి అన్నట్లుగా పులి స్కిన్‌ ఔట్‌ ఫిట్‌లో కనిపించింది.


మూడు పదుల వయసులో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా పాతికేళ్ల లోపు పడుచు అమ్మాయి అన్నట్లుగా ఈ ఫోటోల్లో ఉంది. అందాల పులి అంటూ అభిమానులు పిలుచుకుంటూ ఉన్నారు. పులి తన కోరలతో చంపేస్తే, ఈమె తన చూపులతో చంపేస్తుంది అంటూ కిల్లింగ్‌ లుక్స్‌ కి ఫిదా అయ్యాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మరోసారి ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలతో తమన్నా వార్తల్లో నిలుస్తోంది.