మూడేళ్లుగా నో రొమాన్స్.. ప్రైవేట్ జెట్ కొన్నాకే!
సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఉర్ఫీ జావేద్ గురించి తెలిసే ఉంటుంది. ఆమె మొదట నటిగా కెరీర్ ను ఆరంభించింది.
By: Tupaki Desk | 28 Aug 2024 9:30 AM GMTసోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఉర్ఫీ జావేద్ గురించి తెలిసే ఉంటుంది. ఆమె మొదట నటిగా కెరీర్ ను ఆరంభించింది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవాలని భావించింది. అందుకోసం అందమైన తన ఫోటోలను షేర్ చేసింది, కానీ అవి అంతగా జనాలను ఆకర్షించలేక పోయాయి. దాంతో ఆమె అందరి కంటే వినూత్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్ ను ధరించి ఫోటో షూట్స్ చేయించుకుని, ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ వచ్చింది. ఆ ఫోటోల వల్ల ఉర్ఫీ జావేద్ కి మంచి గుర్తింపు లభించింది.
బిగ్ బాస్ లో కూడా అవకాశం దక్కించుకున్న ఉర్ఫీ కి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. వెంటనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఉర్ఫీ షేర్ చేసే ఫోటోలు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె చేసే కామెంట్స్ తో పాటు, కొన్ని ఫోటోలు వివాదాస్పదం అయిన సందర్భాలు ఉన్నాయి. తనను జనాలు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించేందుకు తాను ఇష్టపడుతాను అంటూ ఉర్ఫీ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఉర్ఫీ జావేద్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీస్ రూపొందింది.
'ఫాలో కర్లో యార్' అనే టైటిల్ తో ఉర్ఫీ తన జీవిత విశేషాలను చెప్పేందుకు రెడీ అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ ఆగస్టు 23న స్ట్రీమింగ్ అయ్యింది. రెండో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఉర్ఫీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు సమంత మంచి ఆన్ లైన్ స్నేహితురాలు అంది. తాను షేర్ చేసిన ఏదైనా వీడియో లేదా ఫోటో బాగుంటే తప్పకుండా తన ఇన్‌స్టా స్టోరీ లో షేర్ చేస్తుందని ఉర్ఫీ తెలియజేసింది.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అంటే చాలా ఇష్టమని, అతడిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. గత మూడు సంవత్సరాలుగా తాను శృంగారానికి దూరంగా ఉన్నాను అని, కనీసం ఎవరితో ముద్దు కూడా పెట్టుకోలేదు, ఈ మధ్య కాలంలో ఎవరితో రొమాంటిక్ గా కూడా మాట్లాడలేదు. జీవితంలో నేను చేసుకోబోతున్న భాగస్వామి కంటే తక్కువ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో కష్టపడుతున్నాను. ఒక ప్రైవేట్ జెట్ కొనే వరకు ఎవరితోనూ రొమాన్స్ లో పాల్గొనను, కనీసం రొమాంటిక్ గా కూడా మాట్లాడను అంటూ ఉర్ఫీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.