Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఊర్వ‌శి కాదు మ‌ణిపురి బుట్ట‌బొమ్మ‌

ఊర్వ‌శి మ‌రోవైపు బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్లతో ఆక‌ర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 7:30 PM GMT
ఫోటో స్టోరి: ఊర్వ‌శి కాదు మ‌ణిపురి బుట్ట‌బొమ్మ‌
X

ఊర్వ‌శి రౌతేలా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మెగాస్టార్ `వాల్తేరు వీర‌య్య‌`లో స్పెష‌ల్ నంబ‌ర్ లో స్టెప్పులేసిన ఈ భామ‌కు ఇక్క‌డా ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌స్తుతం న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- బాబి సినిమాలోను ఊర్వ‌శి న‌టిస్తోంది. ఇంత‌కుముందు గోపిచంద్ సినిమాలోను స్పెష‌ల్ నంబ‌ర్ తో ఆక‌ట్టుకుంది.

ఊర్వ‌శి మ‌రోవైపు బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్లతో ఆక‌ర్షిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్ 2024లో అద్భుతమైన గోల్డ్ అండ్ రెడ్ క‌ల‌ర్ మణిపురి పొట్లోయ్ ధరించి క‌నిపించింది. సంప్రదాయ మణిపురి పెళ్లి దుస్తుల్లో ఊర్వ‌శి ఎంతో అందంగా క‌నిపించింది. ప్రఖ్యాత మణిపురి డిజైనర్ రాబర్ట్ నౌరెమ్ రూపొందించిన ఈ దుస్తులలో మెయిటీ కమ్యూనిటీ సాంస్కృతిక గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ఊర్వ‌శి అందంగా ప్రదర్శించారు. సాధారణంగా మణిపురి వధువులు ఇలాంటి దుస్తుల‌ను ధరిస్తారు. పొట్లోయ్ అనేది సంప్రదాయంతో నిండుగా క‌నిపించే ఒక ప్రత్యేకమైన ఐకానిక్ వస్త్రం. మణిపురి బ్రైడల్ స్థాయిని ప్రత్యేకంగా నిలబెట్టే ముఖ్య అంశాలలో ఒకటి పొట్లోయి. ఒక స్థూపాకార డ్రమ్-ఆకారపు స్కర్ట్. దీని కోసం మందపాటి ఫైబర్ , వెదురు బొంగులు ఉప‌యోగిస్తారు. స్కర్ట్‌ను శాటిన్‌తో కప్పి ఉంచి సంక్లిష్టమైన థ్రెడ్‌వర్క్, సీక్విన్స్ అద్దాలతో భారీగా అలంకరించారు.

దీనికోసం హస్తకళ చాలా క‌చ్ఛిత‌త్వంతో ఉప‌క‌రించింది. ఇలాంటి డిజైన‌ర్ డ్రెస్ ని పూర్తి చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. దీనికి హాఫ్ స్లీవ్ జాకెట్టు మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. పెళ్లి వేడుక‌ ప్రత్యేక సందర్భం కోసం ఊర్వశి బంగారు దారం ఎంబ్రాయిడరీతో అలంకరించిన ఎరుపు రంగు పొట్లాయ్‌ను ధరించింది. సంప్రదాయ ఆకుపచ్చ జాకెట్టును ధ‌రించింది.

రాబర్ట్ నౌరెమ్ ఈశాన్య భారతదేశంలోని సాంప్రదాయ ఫ్యాషన్‌ను హైలైట్ చేయగ‌ల స‌మ‌ర్థుడు. అత‌డు ఇంతకుముందు సుస్మితా సేన్, హర్నాజ్ కౌర్ సంధు, లారా దత్తా వంటి ప్రముఖుల‌కు ఇన్నాఫీ, ఫనెక్ వంటి సాంప్రదాయ మణిపురి దుస్తులను అందించాడు. ఇన్నాఫీ అనేది బ్లౌజ్‌పై ధరించే తేలికపాటి మస్లిన్ శాలువా, అయితే ఫనెక్ అనేది మణిపురి మహిళలు సాధారణంగా ధరించే సమాంతర చారలతో కూడిన చీరలాంటి వస్త్రం.

పొట్లోయి మూలాల్లోకి వెళితే.. భాగ్యచంద్ర మహారాజ్ (1763-1798) పాలనలో వీటిని గుర్తించారు. అతడు దీనిని శాస్త్రీయ రాస్-లీలా నృత్యానికి ధ‌రించాల్సిన‌ దుస్తులుగా పరిచయం చేశాడు. కాలక్రమేణా ఇది మెయిటీ వధువుల సంప్రదాయ వివాహ దుస్తులలో భాగమైంది. పొట్‌లోయ్‌ను రూపొందించడం అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ.