Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బాల‌న్ బోల్డ్ అందాలు

`భూల్ భూలైయా 3`లో నటించిన విద్యాబాల‌న్ అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో హృద‌యాల‌ను గెలుచుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2025 4:06 AM GMT
ఫోటో స్టోరి: బాల‌న్ బోల్డ్ అందాలు
X

`భూల్ భూలైయా 3`లో నటించిన విద్యాబాల‌న్ అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో హృద‌యాల‌ను గెలుచుకున్నారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన బాల‌న్, ఈసారి కూడా పెద్ద తెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌తో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఇది బాల‌న్ కి కెరీర్ ప‌రంగా చాలా కీల‌క‌మైన స‌మ‌యం. వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.


అదే స‌మ‌యంలో బాల‌న్ వ‌రుస ఫోటోషూట్లు వెబ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ బ్యూటీ త‌దుప‌రి ఏ సినిమాలో న‌టిస్తోంది అనేది అటుంచితే, ఇప్ప‌టికి ఘాటైన ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యూత్‌లో త‌న బోల్డ్ ఇమేజ్ ని కాపాడుకుంటోంది. తాజాగా విద్యా బాల‌న్ త‌న టోన్డ్ బాడీ అందాల‌ను ఆవిష్క‌రిస్తూ గుబులు రేపుతోంది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు నెట్‌లో వైర‌ల్‌గా మారుతోంది.


కాంజీవరం చీర‌లో లేదా బ్రీజీ లినెన్ చీరలో క‌నిపించినా బాలన్ కి అవి వంద‌శాతం యాప్ట్. కానీ అందుకు భిన్నంగా పూర్తి మోడ్ర‌న్ దుస్తుల్లోను బాల‌న్ అంతే అందంగా క‌నిపిస్తుంది. ఈ బ్యూటీ మోడ్ర‌న్ అటైర్ కి అంతే బాగా సూట‌బుల్. విద్యా బాలన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఎథ్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ `షోబితం` బెంగళూరు స్టోర్ ఇటీవల ప్రారంభ‌మైంది. అక్క‌డ అభిమానులు చీరలు ధరించి క‌నిపించారు. బ‌నారసి సిల్క్ చీర ధరించి, తన అమ్మమ్మ తన మొదటి చీరను బహుమతిగా ఇచ్చిన జ్ఞాపకాలను, ముంబైలోని చెంబూర్‌లో పెరిగిన జ్ఞాపకాలను బాల‌న్ ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుంది.


మీ సినిమాల విషయానికి వస్తే, లుక్ ప‌రంగా తీసుకునే జాగ్ర‌త్త‌లు ఎలా ఉంటాయి? అని తాజా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా బాల‌న్ స‌మాధానం ఆలోచింపజేసింది. నేను ఒక పాత్రపై పని చేస్తున్నప్పుడు, ఆ పాత్ర ఏమి ధరిస్తుందో నిర్దేశిస్తుంది. నాకు క‌చ్చితంగా ఒక ధృక్కోణం ఉంటుంది. ప్రతి సినిమాలో నేను వేరే పాత్రను పోషిస్తున్నప్పటికీ, నా వ్యక్తిత్వానికి సరిపోని వస్తువులను నేను ధరించలేను. సాధారణంగా చెప్పాలంటే, నా పాత్రల వార్డ్‌రోబ్‌ను సృష్టించినందుకు నేను ఎటువంటి క్రెడిట్ తీసుకోలేను. ఎందుకంటే పాత్రను అర్థం చేసుకున్న కొంతమంది మంచి కాస్ట్యూమ్ డిజైనర్లతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది! అని బాల‌న్ తెలిపింది.