2025 లోనూ బాలీవుడ్ ని తొక్కుకుంటూ పోవడమేనా?
తొలిసారి ఓ తెలుగు చిత్రం `పుష్ప-2` డబ్బింగ్ రూపంలో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లతో జెంటా పాతేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jan 2025 4:30 PM GMTతొలిసారి ఓ తెలుగు చిత్రం `పుష్ప-2` డబ్బింగ్ రూపంలో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లతో జెంటా పాతేసిన సంగతి తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలందరి రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ ఫేజ్ నుంచి ఎలా బయట పడాలని బాలీవుడ్ కిందా మీదా పడుతోంది. కొత్త ఏడాదిలోనైనా? మెరుగైన ఫలితాలు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. అయినా కూడా అది సాధ్యమవుతుందా? లేదా? అన్న టెన్షన్ బాలీవుడ్ గుండెల్లో మరోవైపు రైళ్లు పరిగెట్టిస్తుంది.
ఎందుకంటే టాలీవుడ్...బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల్లో అంతటి వ్యత్యాసం కనిపిస్తుంది. గత ఏడాది మొత్తం అన్నిభాషల బాక్సాఫీస్ గ్రాస్ 12 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 167 కోట్లు ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి బాలీవుడ్ ని తీసుకుంటే 4679 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అందులో 31 శాతం డబ్బింగ్ సినిమాలవే. పుష్ప-2 ఒక్కటే 889 కోట్లు రాబట్టింది. స్ట్రెయిట్ చిత్రాల పరంగా చూస్తే బాలీవుడ్ మొత్తం గ్రాస్ 37 శాతం తగ్గిపోవడం అక్కడిప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది.
స్తీ-2, మూంజ్యా, భూల్ భులయ్యా2 మంచి విజయాలు సాధించడంతో ఆ మాత్రమైనా మెరుగైన రిజల్ట్ వచ్చింది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. హిందీలో తెలుగు సినిమాలు 15 నుంచి 20 శాతం అధిక్యంలో ఉన్నాయి. మరి 2025 బాలీవుడ్ కి ఎలా ఉండబోతుంది? టాలీవుడ్ కి ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడా తెలుగు స్టార్ హీరోల డామినేషన్ కనిపిస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ `సికిందర్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
కానీ మురగదాస్ వరుస వైఫల్యాల్లో చేస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమా సక్సెస్ ని అప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. `వార్ -2` లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిం చినా? అది హృతిక్ సోలో సక్సెస్ కిందకు వెళ్లదు. ఎన్టీఆర్ స్టార్ డమ్ తోనూ సౌత్ లో రాణిస్తుంది. కాబట్టి అది సక్సెస్ అయినా బాలీవుడ్ గర్వంగా కాలరెగరేయలేని పరిస్థితి. ఇక షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలైతే లేనే లేవు. ఇంత వరకూ వాళ్లు కొత్త సినిమాలేవి కమిట్ అవ్వలేదు.
షారుక్ ఖాన్ కుమార్తె సినిమాలో నటిస్తున్నా? ఆ ప్రభావం పెద్దగా ఉండదు. కానీ టాలీవుడ్ నుంచి మాత్రం పాన్ ఇండియాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. `హరిహర వీరమల్లు`, `విశ్వంభర`. `కోహినూర్`, `ది రాజా సాబ్`, `ఫౌజీ` చిత్రాలు భారీ అంచనాల మధ్య వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025 కూడా టాలీవుడ్ కే అనుకూలంగా కనిపిస్తుంది.