బాలీవుడ్ స్ట్రాంగ్ లైనప్ కోల్పోయిందా?
కొంత కాలం పాటు ఈ స్టార్ హీరోల చిత్రాలతో బాలీవుడ్ కళకళలాడింది. అప్పట్లో బాలీవుడ్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? ఓ పండగలా ఉండేది.
By: Tupaki Desk | 21 March 2025 12:08 PM ISTఅమితా బచ్చన్ జనరేషన్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరోలతో బాలీవుడ్ ఎంతో స్ట్రాంగ్ లైనప్ కి కలిగి ఉండేది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, సునీల్ శెట్టి, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ ఇలా తర్వాత జనరేషన్ హీరోలతో బాలీవుడ్ ఎంతో స్ట్రాంగ్ గా కనిపించింది. కొంత కాలం పాటు ఈ స్టార్ హీరోల చిత్రాలతో బాలీవుడ్ కళకళలాడింది. అప్పట్లో బాలీవుడ్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? ఓ పండగలా ఉండేది.
హిట్ అనే మాట తప్ప ప్లాప్ అనే మాటే వినిపించేది కాదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల చిత్రాల లిస్ట్ చూస్తే బాలీవుడ్ హీరోల సినిమాలు మాత్రమే కనిపించేవి. మిగతా పరిశ్రమల కంటే భారీ బడ్జెట్ చిత్రాలు అక్కడ నుంచే తెరకెక్కేవి. ఈ నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో అగ్రగామి పరిశ్రమ ఏది? అంటే అంతా బాలీవుడ్ వైపు చూపించేవారు. అందుకు కారణం స్ట్రాంగ్ లైనప్ లో హీరోలు ఉండటం..ఏడాదిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడంతోనే ఇది సాధ్యమైంది.
ఇది కాదనలేని వాస్తవం. అయితే ఇప్పుడా పరిస్థితి బాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. పూర్తి గా ఫాం కోల్పోయిన సన్నివేశమే కనిపిస్తుంది. కొంత కాలంగా అమీర్ ఖాన్ , షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ ల నుంచి సినిమా రిలీజ్ అవ్వాలంటే మూడేళ్లు అయినా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురి కంటే సల్మాన్ ఖాన్ వేగంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే భాయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
ఇక అజయ్ దేవగణ్ మార్కెట్ చాలా కాలంగా డౌన్ ఫాల్ లో ఉంది. అక్షయ్ కుమార్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. సునీల్ శెట్టి అయితే బాలీవుడ్ లో కనిపించనే లేదు. టీవీ షోలు తప్ప సినిమా అవకాశాలే రాకపోవడంతో సునీల్ శెట్టి ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డాడు. ఇక వాళ్ల తర్వాత తరం హీరోలు చూస్తే వాళ్ల పరిస్థితి మరింత బలహీనంగానే కనిపిస్తుంది.
రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, పర్హాన్ అక్తర్, రాజ్ కుమార్ రావు, ఇంకా మరి కొంత మందితో పాటు, ఫాంలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు కూడా స్ట్రాంగ్ లైనప్ ని మిస్ అవు తున్నారు. వీళ్లందరిలో రణబీర్ కపూర్ ని సపరేట్ చేయాలి. వాళ్లకంటే మెరుగైన స్థానంలోనే రణబీర్ కనిపిస్తున్నాడు. రణవీర్ సింగ్ గొప్ప నటుడైనా? లైనప్ ని మిస్ అవుతున్నాడు. విక్కీ కౌశల్, షాహిద్ కపూర్ లు విజయాలు అందుకుంటున్నా? ఆ సక్సస్ లు బలంగా నిలబడటం లేదు.
కంటెంట్ బేస్డ్ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీకే రిలీజ్ కే కట్టుబడుతున్నాయి. దీంతో మంచి కంటెంట్ వచ్చినా? నాన్ థియేట్రికల్ కంటెంట్ కావడంతో రీచ్ దొరకవడం లేదు. మరి ఫాం కోల్పోయిన బాలీవుడ్ మళ్లీ పుంజుకోవాలంటే? హీరోలంతా సరైన కంటెంట్ తో సినిమాలు చేసి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటేనే సాధ్యమవుతుంది. అలాగే ఆ కంటెంట్ కూడా ఎక్కువగా థియేట్రికల్ రిలీజ్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఇండియాలో టాలీవుడ్ సినిమా ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో తెలుగు సినిమా దూకుడికి బాలీవుడ్ కుదేలైంది అన్నది సుస్పష్టం.