హీరోయిన్ సెంట్రిక్ మూవీస్.. సౌత్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్!
హీరోకి జోడీ ఉండాలి కాబట్టి ఉంది అనుకునే విధంగా కథానాయికల పాత్రలు ఉండేవి. కానీ ఈ మధ్య అక్కడ కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 28 Nov 2024 3:00 AM GMTసౌత్ తో కంపేర్ చేసి చూస్తే, బాలీవుడ్ లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో మహిళా ప్రధాన పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అదే సమయంలో హిందీలో మాత్రం హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితం చేస్తుంటారు. హీరోకి జోడీ ఉండాలి కాబట్టి ఉంది అనుకునే విధంగా కథానాయికల పాత్రలు ఉండేవి. కానీ ఈ మధ్య అక్కడ కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాల్లోనూ మహిళా పాత్రలకు అధిక ప్రాధాన్యత ఉంటోంది. హిందీ ఫిలిం మేకర్స్ కూడా స్క్రీన్ మీద పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ తో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నారు. హీరోయిన్లు సైతం అలంకార ప్రాయంగా ఉండే పాత్రలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఏదైనా ప్రత్యేకత ఉంటేనే నటిస్తున్నారే తప్ప, రెగ్యులర్ గ్లామరస్ రోల్స్ చేయడం లేదు. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ రోల్స్ లోనే హీరోయిన్లకు చూడటానికి ఇష్టపడుతున్నారు.
హిందీ సినిమాల్లోనే కాదు, వెబ్ సిరీస్ లలోనూ మహిళల పాత్రలు బలంగా ఉంటున్నాయి. ఇవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన 'క్రూ' సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అంతకముందు కృతి నటించిన 'మిమి' మూవీ సక్సెస్ అవ్వడమే కాదు, ఆమెకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది.
ఇటీవల కాజోల్, కృతి సనన్ కలిసి నటించి 'దో పట్టి' మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలై, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. శక్తివంతమైన మహిళా ప్రధాన పాత్రలతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన 'హీరామండి: ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంది. కరీనా కపూర్ ఖాన్ నటించిన 'జానే జాన్', 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.
ఇటీవల వచ్చిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ లో సమంత రూత్ ప్రభు బలమైన పాత్ర పోషించింది. 90వ దశకం ప్రారంభంలో సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదని ఈ పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఉమెన్ సెంట్రిక్ సిరీస్ కానప్పటికీ, సామ్ పాత్ర వరుణ్ ధావన్ ను డామినేట్ చేసింది. ఇక 'గంగుబాయి కథియావాడి' 'డార్లింగ్స్' 'జిగ్రా' వంటి మహిళా ప్రధాన చిత్రాల్లో ఆలియా భట్ అదరగొట్టింది.
ఇలా బాలీవుడ్ లో లేడీ ప్రధాన పాత్రలతో అనేక సినిమాలు వచ్చాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఆడియన్స్ ను ఆకట్టుకున్నవే ఉన్నాయి. హీరోయిన్ల సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకొని కొందరు దర్శకులు మంచి విజయాలు అందుకుంటున్నారు. కాకపోతే ఇప్పటికీ కథానాయికలను ఏదో అలంకార ప్రాయంగా చూసే ఫిలిం మేకర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికైతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. మరి రానున్న రోజుల్లో మహిళా ప్రధాన పాత్రల్లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.