Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో జ్యూస్ షాప్ పెడుతున్న స్టార్ హీరో

ఒక‌ప్పుడు అత‌డు సూపర్ మోడ‌ల్.. ఆ త‌ర్వాత హీరో అయ్యాడు. కెరీర్ ఆరంభ‌మే ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక‌తో ఎఫైర్ న‌డిపించాడు.

By:  Tupaki   |   27 Dec 2024 7:30 AM GMT
ఆంధ్రాలో జ్యూస్ షాప్ పెడుతున్న స్టార్ హీరో
X

ఒక‌ప్పుడు అత‌డు సూపర్ మోడ‌ల్.. ఆ త‌ర్వాత హీరో అయ్యాడు. కెరీర్ ఆరంభ‌మే ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక‌తో ఎఫైర్ న‌డిపించాడు. అత‌డు కెరీర్ లో పాతిక సినిమాల్లో న‌టిస్తే ఒకే ఒక్క హిట్టు ద‌క్కింది. అయితే ఆ ఒక్క హిట్టుతోనే అత‌డు చాలాకాలం పాటు న‌టుడిగా కొన‌సాగ‌డం విశేషం. తెలుగులో అఖిల్ న‌టించిన ఏజెంట్‌లోను కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఆస‌క్తిక‌రంగా అత‌డు జ్యూస్ అమ్మడానికి న‌ట‌న‌ను వదిలి వెళ్లాడు. అయితే వ్యాపారంలో అత‌డు రూ. 82 కోట్ల నికర ఆస్తుల‌తో ఒక పెద్ద‌ కంపెనీని నిర్మించాడు.

ఈ హీరో ఎవ‌రో తెలుసుకోవాల‌నుందా?.. అత‌డే బాలీవుడ్ హీరో డినో మోరియో. బాలీవుడ్ కి ఎంద‌రో వ‌చ్చి వెళుతుంటారు. కానీ ఈ హీరో వ‌రుస‌గా 21 ఫ్లాపులు ఎదుర్కొని కూడా ఇంకా నటుడిగా నిల‌బ‌డ్డాడు. 1999లో ప్యార్ మే కభీ కభీ చిత్రంతో తెరంగేట్రం చేసిన అత‌డు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అతని మొదటి చిత్రం ఫ్లాప్‌. కానీ 2002లో ఒకే ఒక్క‌ హిట్ చిత్రంతో అతడి జీవితం మారిపోయింది. కొన్నేళ్ల పాటు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేనంత పెద్ద హిట్టు కొట్టాడు. నిజానికి రాజేష్ ఖన్నా కుమార్తె రింకే ఖన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న డెబ్యూ సినిమా ఫ్లాప్ అవ్వ‌డం డినో మోరియోని నిరాశ‌ప‌రిచింది. డినో న‌టించిన‌ చాలా చిత్రాలు ఫ్లాప్‌లుగా మారినా కానీ, అతనికి ఓవ‌ర్‌నైట్‌లో పేరు తెచ్చిన చిత్రం - రాజ్. ఇది హార‌ర్ జాన‌ర్ చిత్రం. ఈ సినిమా క‌థానాయిక బిపాసా బ‌సుతో అత‌డు కొంత‌కాలం పాటు డేటింగ్ కూడా చేసాడు.

`రాజ్` చిత్రం 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోద‌గ్గ‌ హిట్ అయింది. కానీ వ‌రుస‌గా 21 ఫ్లాపులు చ‌వి చూసాడు. సౌత్ లో న‌టించిన ఏకైక చిత్రం ఏజెంట్ కూడా డిజాస్ట‌ర‌వ్వ‌డం అత‌డికి క‌లిసి రాలేదు. అయితే అత‌డు అవ‌కాశాల్లేని స‌మ‌యంలో వృధా ఆలోచ‌న‌లు చేయ‌లేదు. తెలివిగా బిజినెస్ వెంచర్స్ ప్లాన్ చేసాడు. 2012లో MS ధోనీతో కలిసి డినో `కూల్ మాల్` అనే తన మర్చండైజింగ్ కంపెనీని ప్రారంభించాడు. అలాగే క్లాక్‌వైస్ ఫిల్మ్స్ పేరుతో తన నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. తరువాత తన బ్యానర్‌లో `జిస్మ్ 2`ను నిర్మించాడు. తరువాత అతడు మిథిల్ లోధా , రాహుల్ జైన్‌లతో కలిసి కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ బ్రాండ్ అయిన `ది ఫ్రెష్ ప్రెస్‌`ని సహ య‌జ‌మానిగా సంస్థ‌ను స్థాపించారు. 2018లో ప్రారంభించినప్పటి నుండి ఈ బ్రాండ్ 36 కేంద్రాల్లో విస్త‌రించింది. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ త‌దితర రాష్ట్రాలు సహా భారతదేశంలోని సౌత్ రాష్ట్రాలకు తన ఉనికిని విస్తరించాలని యోచిస్తోంది. ఆంధ్రా, తెలంగాణ‌లో కీల‌క న‌గ‌రాల‌కు ఇది విస్త‌రించే ఆలోచ‌న ఉంద‌ని చెబుతున్నారు.