పోటీ అవసరమా.. సూపర్ స్టార్‌పై విమర్శలు
కొన్ని సినిమాలు మరీ దారుణంగా సౌత్‌లో చిన్న సినిమాల స్థాయిలో కూడా రాబట్టలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ పడటం వల్ల మరింత నష్టం తప్ప మిగిలేది ఏమీ లేదు.
By: Tupaki Desk | 15 March 2025 5:00 PM ISTబాలీవుడ్‌లో పరిస్థితులు అసలు బాగా లేవు. సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. కరోనా ముందు పర్వాలేదు అన్నట్లుగా ఉన్న సక్సెస్ రేటు గత అయిదు సంవత్సరాల్లో అత్యంత దారుణంగా పడిపోయిన విషయం అందరికీ తెల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు సైతం కరోనా తర్వాత బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు మినిమం వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు కనీసం పాతిక కోట్ల ఓపెనింగ్స్ వసూళ్లు రాబట్టడానికి కిందా మీద పడుతున్నారు. కొన్ని సినిమాలు మరీ దారుణంగా సౌత్‌లో చిన్న సినిమాల స్థాయిలో కూడా రాబట్టలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ పడటం వల్ల మరింత నష్టం తప్ప మిగిలేది ఏమీ లేదు.
గత ఐదేళ్ల కాలంలో బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాలను వేల్ల మీద లెక్కించవచ్చు. అలాంటి పరిస్థితి ఉంటే ఇండస్ట్రీ మనుగడ ప్రమాదం లో ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు బాధ్యతతో ప్రవర్తించాలని, కానీ ఆ పెద్ద హీరోలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అభిమానులు గత కొన్నాళ్లుగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సినిమాకు కావాలని పోటీగా ఒకే రోజు లేదా ఒకే వారంలో అమీర్ ఖాన్ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
తన సినిమా ఫలితం ఏమైనా పర్వాలేదు కానీ అక్షయ్ కుమార్ సినిమా ఫలితంను దెబ్బ కొట్టాలనే విధంగా అమీర్ ఖాన్ ప్రవర్తన ఉందంటూ వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అక్షయ్ కుమార్ సినిమాను కావాలని తన సినిమాతో ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి అదే పని అమీర్ ఖాన్ చేయబోతున్నాడు అంటూ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆ విషయం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 5 సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అదే సమయంలో తన సినిమాను అమీర్ ఖాన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది.
అమీర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమాలో నటిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ వర్గాల్లో జూన్ నెలలో సినిమాను విడుదల చేసే విధంగా మేకర్స్ పై అమీర్ ఖాన్ ఒత్తిడి తీసుకు వస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం కేవలం ఆయన హౌస్‌ఫుల్ 5 ను ఢీ కొట్టడం కోసం తన సితారే జమీన్ పర్ సినిమాను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.