Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో పుష్ప రాజ్ భయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా ఐదు ఇండియన్ భాషలలో రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:17 AM GMT
బాలీవుడ్ లో పుష్ప రాజ్ భయం
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా ఐదు ఇండియన్ భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే వరల్డ్ వైడ్ గా సాలీడ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ డీల్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘పుష్ప 2’ మూవీ కోసం నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజ్ అయిన ‘పుష్ప 1’ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అందుకే ఈ సారి భారీ అంచనాలతో థియేటర్స్ లోకి రాబోతున్న ‘పుష్ప 2’ మొదటి రోజే 200 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ‘పుష్ప 2’ రిలీజ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ని భయపెడుతుందనే మాట వినిపిస్తోంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ‘సింగం’ సిరీస్ లో మరో మూవీ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ సింగ్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ తో రోహిత్ శెట్టి ఈ మూవీ చేస్తున్నారు. ‘సింగం అగైన్’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రండిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ మూవీలలో ఒకటిగా ‘సింగం అగైన్’ ఉంది. నార్త్ ఇండియాలో 60 శాతం థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది.

ఇక అదే రోజు కార్తిక్ ఆర్యన్ హీరోగా ‘భూల్ భూలయ్యా 3’ మూవీ రాబోతోంది. ఈ సినిమాపైనే కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన ఐదు రోజుల తర్వాత ‘పుష్ప 2’ థియేటర్స్ లోకి రాబోతోంది నార్త్ ఇండియన్ ఆడియన్స్ క్రేజ్ నేపథ్యంలో ‘పుష్ప 2’ ఇంపాక్ట్ ‘సింగం ఎగైన్’, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రాలపై పడటం గ్యారెంటీ అని అంటున్నారు. ‘సింగం ఎగైన్’ కి స్టార్ క్యాస్టింగ్ ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పుష్ప 2 ప్రభావం కొంత తగ్గొచ్చు.

‘భూల్ భూలయ్యా 3’, ‘పుష్ప 2’ డిస్టిబ్యూటర్స్ ఒక్కరే కావడంతో ఇప్పుడు ఆ సినిమాకి ఎక్కువ తలనొప్పి అని తెలుస్తోంది. అయితే షోలు అడ్జస్ట్ చేసుకోవాలని డిస్టిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం పుష్ప 2పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ‘భూల్ భూలయ్యా 3’ వాయిదా వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.