Begin typing your search above and press return to search.

అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన సినిమా ఏదంటే.. టాప్ 10 ఫుట్‌ఫాల్స్!

బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాల లిస్టులో కొన్ని క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   19 March 2025 3:30 PM IST
అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన సినిమా ఏదంటే.. టాప్ 10 ఫుట్‌ఫాల్స్!
X

సినిమా విజయాన్ని కొన్నిసార్లు కేవలం కలెక్షన్లతో కాకుండా, ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లిన సంఖ్యతో కూడా అంచనా వేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో టికెట్లు అమ్ముడైన సంఖ్య (ఫుట్‌ఫాల్స్) ఎంతో కీలకం. ఓ సినిమా ఎంత మంది థియేటర్లలో చూసారన్నదే అసలు సినిమా ప్రభావాన్ని అర్థం చేసుకునే అసలైన ఫ్యాక్టర్. బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాల లిస్టులో కొన్ని క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి.

బాలీవుడ్‌లో ఇప్పటికీ ఎవ్వరూ అధిగమించలేని రికార్డ్ సల్మాన్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. అతడి సినిమా హమ్ ఆప్ కే హై కౌన్ (HAHK) ఏకంగా 8 కోట్ల టికెట్లు అమ్ముకుంది. తర్వాతి స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే (DDLJ) 5 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించింది. అలాగే, ఆమిర్ ఖాన్ రాజా హిందుస్తానీ (4.20 కోట్లు), హృతిక్ రోషన్ కభీ ఖుషీ కభీ గమ్ (3.20 కోట్లు), రణబీర్ కపూర్ యానిమల్ (3 కోట్లు) లాంటి చిత్రాలు అత్యధిక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.

ఈ లిస్టులో బాలీవుడ్ మాస్ హీరోలతో పాటు, వర్సటైల్ యాక్టర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ నటించిన ఛవ్వా కూడా 3 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించడంతో, అతని కెరీర్‌కు ఓ పెద్ద రికార్డ్ అయింది. అలాగే రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ఇద్దరూ పద్మావత్ సినిమాతో ఈ రికార్డులొ ఉన్నారు. అక్షయ్ కుమార్ నటించిన మోరా (2.17 కోట్లు), అజయ్ దేవ్‌గన్ నటించిన తాన్హాజీ (2.15 కోట్లు) కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.

ఇదంతా చూస్తే బాలీవుడ్‌ హీరోలకున్న ఫ్యాన్ బేస్ స్పష్టంగా తెలుస్తోంది. సల్మాన్, షారుఖ్, ఆమిర్ లాంటి స్టార్స్ తమ కెరీర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు నూతన తరం ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమయ్యారు. బాలీవుడ్‌లో టికెట్ అమ్మకాల పరంగా చూస్తే, మాస్ సినిమాలు ఎక్కువగా విజయం సాధించాయి.

మొత్తంగా, బాలీవుడ్‌లో ఇప్పటి వరకు అత్యధిక మంది (ఫుట్‌ఫాల్స్) థియేటర్లకు వెళ్లిన సినిమాల లిస్టు ఇలా ఉంది:

1. సల్మాన్ ఖాన్ - హమ్ ఆప్ కే హై కౌన్ - 8 కోట్ల టికెట్లు

2. షారుఖ్ ఖాన్ - దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే - 5 కోట్లు

3. ఆమిర్ ఖాన్ - రాజా హిందుస్తానీ - 4.20 కోట్లు

4. హృతిక్ రోషన్ - కభీ ఖుషీ కభీ గమ్ - 3.20 కోట్లు

5. రణబీర్ కపూర్ - యానిమల్ - 3 కోట్లు

6. విక్కీ కౌశల్ - ఛవ్వా - 3 కోట్లు

7. రణవీర్ సింగ్ - పద్మావత్ - 2.35 కోట్లు

8. షాహిద్ కపూర్ - పద్మావత్ - 2.35 కోట్లు

9. అక్షయ్ కుమార్ - మోరా - 2.17 కోట్లు

10. అజయ్ దేవ్‌గన్ - తాన్హాజీ - 2.15 కోట్లు