ఇద్దరు లెజెండ్స్ నటవారసులతో రియల్ ఛాలెంజ్
ఇండస్ట్రీకి మైండ్ బ్లాక్ చేసే ట్రీట్ ఇవ్వడానికి మరో నటవారసురాలు బరిలో దిగుతోంది.
By: Tupaki Desk | 8 Feb 2025 1:30 PM GMTఇండస్ట్రీకి మైండ్ బ్లాక్ చేసే ట్రీట్ ఇవ్వడానికి మరో నటవారసురాలు బరిలో దిగుతోంది. పేరు నవోమికా శరణ్. బాలీవుడ్ మొట్టమొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా, నటి డింపుల్ కపాడియాల మనవరాలు ఈ బ్యూటీ. ఇన్ స్టాలో జరంత స్పీడ్ మీద ఉన్న నవోమికా వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా సరసన నవోమిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అగస్త్య నందా ఇప్పటికే `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ తో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అతడు వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు.
అయితే అమితాబ్ మనవడితో రాజేష్ ఖన్నా మనవరాలు డెబ్యూ నటిగా పరిచయమవుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా నవోమిక అందచందాలు, ఎక్స్‌ప్రెషన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. క్యూట్ లుక్స్ తో ఈ బ్యూటీ యూత్ ని కవ్విస్తోంది. నవోమికా- అగస్త్య జంట బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీలను అందించిన మడాక్ ఫిల్మ్స్ లో నటిస్తుండడంతో ఉత్కంఠ పెరుగుతోంది.
క్విస్మత్, షాదా వంటి హిట్స్ ఇచ్చిన పంజాబీ దర్శకుడు జగదీప్ సిద్ధు బాలీవుడ్ లో ప్రవేశిస్తూ లెజెండరీ పిల్లలతో పని చేస్తుండడంతో అందరి దృష్టి ఇప్పుడు అతడిపైకి మరలింది. పైగా ఇద్దరు స్టార్ కిడ్స్ ని అదిరిపోయే రొమాంటిక్ కామెడీలో చూపించాలనే ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బంధుప్రీతి, ఇన్ సైడర్ ఔట్ సైడర్ డిబేట్ నడుమ నటవారసులతో పని చేయడం అనేది దర్శకనిర్మాతలకు కొత్త సవాళ్లను తెస్తాయి. కానీ దర్శకుడు సిద్ధు వారికి పెద్ద హిట్ ఇస్తాడని ఆశిస్తున్నారు. మడాక్ తో అతడి కలయిక పాజిటివ్ వైబ్స్ తో మంచి విజయం వైపు దారి తీస్తుందని అంచనా వేస్తున్నారు.