వెండి తెరపై స్టార్ కిడ్స్ -కాక పుట్టించే కాంబినేషన్స్!
ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగణ మేనల్లుడు అమన్ దేవగణ్- అందాల తార రవీనా టాండన్ ముద్దులు కూతురు రాషా తడానీ ఆజాద్ సినిమాతో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jan 2025 10:30 PM GMTస్టార్ కిడ్స్ తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందులోనూ ఫేమస్ అయిన హీరోల, హీరోయిన్ల తనయులు జత కడితే తెర మరింత అందంగా మారుతుంది. బాలీవుడ్ ఈ విషయంలో ఎప్పుడూ నిత్య నూతనంగానే హైలైట్ అవుతుంది. తాజాగా మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగణ మేనల్లుడు అమన్ దేవగణ్- అందాల తార రవీనా టాండన్ ముద్దులు కూతురు రాషా తడానీ ఆజాద్ సినిమాతో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అతిలోక సుందరి శ్రీదేవి రెండవ కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఇదే ఏడాది అలరించనుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో 'లవ్యపా'లో నటిస్తోంది. అలాగే ఇబ్రహీం అలీఖాన్ కి జోడీగా 'నాదా నీయన్' లోనూ నటిస్తోంది. ఇదే ఏడాది ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే బాలీవుడ్ లో ఉన్న మిగతా ఖాన్ లు..కపూర్ హీరోలకు జోడీగా నటించాలని అమ్మడు ఆశపడుతోంది.
సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. యంగ్ హీరో సిద్దంత్ చతుర్వేదీ, కార్తీక్ ఆర్యన్ లతోనూ రొమాన్స్ చేయడానికి స్టార్ కిడ్స్ అంతా సిద్దంగా ఉన్నారు. వాళ్లతో నటించే ఛాన్స్ రావాలి గానీ సై అంటూ ముందుకు రావడానికి సిద్దం అంటు న్నారు. అలాగే యంగ్ హీరో లక్ష్య లక్వానీతో అనన్య పాండే ఓ సినిమాలో రొమాన్స్ చేస్తుంది. వామికా గబ్బి, త్రిప్తీ డిమ్రీ లాంటి సీనియర్ భామలు కూడా వారసుల చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు.
2025 లో ఈ క్రేజీ కాంబినేషన్స్ అన్ని ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. మరోవైపు నవ నాయికలైనా సీనియర్ హీరోలతో ఛాన్సులొస్తే నటించడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఛాన్స్ ఇవ్వాలేగానీ యస్ అంటూ ముందు కొస్తు న్నారు. అయితే ఇలాంటి నవ నాయికలు బాలీవుడ్ లో రష్మిక మందన్నా, కీర్తి సురేష్, సమంత లాంటి వారు బ్రేక్ వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ భామలు హిందీలో ఫేమస్ అవ్వడంతో? అనుకున్న స్థాయిలో హిందీ నవ నాయికలకు అవకాశాలు రావడం లేదన్న వాదనా వినిపిస్తోంది.