Begin typing your search above and press return to search.

మ‌హేష్ హీరోయిన్ ఇప్పుడు గూగుల్ ఇండియా బాస్

ఈ బ్యూటీ చివరిసారిగా 2000లో విడుదలైన తెలుగు చిత్రం 'వంశీ'లో కనిపించింది.

By:  Tupaki Desk   |   5 March 2025 11:01 PM IST
మ‌హేష్ హీరోయిన్ ఇప్పుడు గూగుల్ ఇండియా బాస్
X

1996లో 'పాపా కెహతే హై' సినిమాలో న‌టించిన త‌ర్వాత న‌టి మయూరి కాంగో చాలా కాలంగా బాలీవుడ్ లో కనిపించ‌ లేదు. ఈ బ్యూటీ చివరిసారిగా 2000లో విడుదలైన తెలుగు చిత్రం 'వంశీ'లో కనిపించింది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించారు. వంశీలో తన ప్రత్యేక పాట ఓహో సోనియా త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. 1995లో 'నసీమ్' అనే హిందీ చిత్రంతో అరంగేట్రం చేసిన మయూరి 'పాపా కెహతే హై', 'హోగీ ప్యార్ కీ జీత్' వంటి చిత్రాలను మినహాయించి పెద్దగా విజయం సాధించలేదు.

గ్లామ‌ర్ రంగంలో ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌క‌పోవ‌డంతో మ‌యూరి త‌న రూట్ మార్చింది. ఇప్పుడు గూగుల్ ఇండియాలో సీనియర్ హోదాలో ఉంది. టీవీ మూవీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మయూరి 2000లో బుల్లితెర‌పైకి ప్రవేశించి నర్గీస్, థోడా ఘమ్ థోడి ఖుషి, డాలర్ బాబు, కిట్టి పార్టీ వంటి సీరియల్స్‌లో పనిచేసింది. అయితే టీవీ న‌టిగాను ఆశించిన విజయం సాధించలేదు. సినిమాలు, సీరియల్స్‌లో విజయం సాధించకపోవడంతో,

నిరాశ‌ప‌డింది. అటుపై మయూరి డిసెంబర్ 2003లో ఔరంగాబాద్‌లో ఎన్నారై ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకుంది. మయూరి- ఆదిత్య మొదట ఒక కామ‌న్ స్నేహితుడి ద్వారా ఒక పార్టీలో కలుసుకున్నారు. ఈ జంటకు 2011లో ఒక కుమారుడు జన్మించాడు.

తన చదువు సమయంలో మయూరి ఐఐటి కాన్పూర్‌కు ఎంపికైంది. కానీ సినిమాల్లో బిజీ కెరీర్ కారణంగా అక్కడ అడ్మిషన్ తీసుకోలేదు. మ‌యూరి దాదాపు 16 సినిమాలు చేసింది. కానీ వాటిలో చాలా వరకు విడుదల కాలేదు. ఆమె పాపా కెహ్తే హైన్ (1996), హోగి ప్యార్ కి జీత్, బేటాబి, బాదల్, జంగ్, షికారి-కామియో, జీతెంగే హమ్ వంటి చిత్రాలలో నటించింది. మయూరి 2000లో విడుదలైన తెలుగు చిత్రం 'వంశీ'లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇందులో మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ జంట‌గా నటించారు.

వంశీ సినిమాలో న‌టించాక ప‌రిశ్ర‌మ‌లో క‌నిపించ‌లేదు. తరువాత తన భర్తతో కలిసి న్యూయార్క్‌కు వెళ్లి బారుచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి మార్కెటింగ్ & ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందింది. ఆమె గతంలో ఫ్రెంచ్ గ్రూప్ పబ్లిసిస్‌లో భాగమైన ప్రముఖ డిజిటల్ మీడియా ఏజెన్సీ అయిన పెర్ఫార్మిక్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం, మయూరి కాంగో ఐదు సంవత్సరాలకు పైగా గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా పనిచేస్తున్నారు.