అక్కడ నుంచి టాలీవుడ్ కి మళ్లీ అందుకేనా?
అయితే మధ్యలో టాలీవుడ్ కొన్నాళ్ల పాటు మాలీవుడ్, కోలీవుడ్ నటులపై దృష్టి పెట్టింది.
By: Tupaki Desk | 10 March 2025 4:00 PM ISTబాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి విలన్లు దిగుమతి చేసుకోవడం అన్నది కొత్తేంకాదు. ఎప్పటి నుంచో జరుగు తోన్న ప్రక్రియే ఇది. అయితే మధ్యలో టాలీవుడ్ కొన్నాళ్ల పాటు మాలీవుడ్, కోలీవుడ్ నటులపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ నటుల ఎంట్రీ టాలీవుడ్ కి ఉదృతంగా జరుగుతోన్న సమయంలో? అక్కడ నటీనటులు అధిక పారితోషికంగా డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ కి వాళ్లకు బ్రేక్ ఇచ్చి మాలీవుడ్, కోలీవుడ్ నటుల్ని లాంచ్ చేయడం మొదలు పెట్టింది.
కొంత కాలంపాటు ఆ వేవ్ కూడా బాగానే సాగింది. అయితే పదే పదే వాళ్లనే పిలిచి అవకాశాలిస్తే? అధిక పారితోషికాలు డిమాండ్ చేయడం అన్నది పరిపాటే. అలా మాలీవుడ్, కోలీవుడ్ నటులు కూడా డిమాండ్ పెరగడంతో? టాలీవుడ్ ఇప్పుడు వాళ్లను స్కిప్ చేసి మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచలనమైన నేపథ్యంలో బాలీవుడ్ నటులైతే మార్కెట్ పరంగానూ కలిసొస్తురనే ప్లాన్ లో భాగంగా పేరున్న హిందీ నటుల్ని తీసుకోవడం మొదలు పెట్టింది.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో బాలీవుడ్ క్రేజీ నటులే విలన్ గా కనిపిస్తున్నారు. శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'కుభేర'లో జిమ్ సర్బ్ విలన్ గా నటిస్తున్నాడు. 'నీర్జా', 'పద్మావత్', 'సంజు' లాంటి పవర్ పుల్ చిత్రాల్లో నటించిన నటుడీయన. ఇందుల్ జిమ్ మల్టీమిలియనీర్ పాత్ర లో కనిపించనున్నాడు. అలాగే ఇమ్రాన్ హష్మీ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న 'ఓజీ'లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు 'గుఢచారి 2' లో కూడా ఇతడే విలన్.
ఇక అనురాగ్ కశ్యప్ కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. 'డెకాయిట్' లో స్వామి అనే పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో సోహైల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఆర్సీ 16 లోనూ బాలీవుడ్ నటుడే విలన్. దివ్యేందు విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ క్రికెట్ ప్రత్యర్ది అతడే. ఇంకా 'హరిహర వీరమల్లు'లో 'యానిమల్' ఫేం బాబి డియ్ లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
'రాజాసాబ్',' సంబరాల ఏటిగట్టు'లోనూ సంజయ్ దత్ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే 'పౌజీ' చిత్రంలో మిథన్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభ ర' లో కునాల్ కపూర్ విలన్ గా నటిస్తున్నాడు. ఇంకా వెలుగులోకి రాని మరింత మంది హిందీ నటులు తెలుగులో నటిస్తున్నారు.