Begin typing your search above and press return to search.

'ధూమ్ -4' కోసం 'వార్ -2'నే దించుతున్నారా?

ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో య‌శ్ రాజ్ ఫిలింస్ ఏంకే మాత్రం డిలే చేయ‌కూడ‌ద‌ని ముందుకు క‌దులుతుంది

By:  Tupaki Desk   |   4 Oct 2024 8:30 AM GMT
ధూమ్ -4 కోసం వార్ -2నే దించుతున్నారా?
X

`ధూమ్-4` కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో య‌శ్ రాజ్ ఫిలింస్ ఏంకే మాత్రం డిలే చేయ‌కూడ‌ద‌ని ముందుకు క‌దులుతుంది. ఇప్ప‌టికే హీరోగా ర‌ణ‌బీర్ క‌పూర్ని పైనల్ చేసేసింది. హీరో ఎంపిక‌లోనే స‌ద‌రు నిర్మాణ సంస్థ బోలెడంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. చివ‌రిగా ఆదిత్య చోప్రా పాన్ ఇండియాలో ర‌ణ‌బీర్ ఇమేజ్ చెక్ చేసుకుని లాక్ చేసారు. ఈ సారి దూమ్ ప్రాంచైజీకి సౌత్ కోటింగ్ కూడా ఇవ్వాల‌ని చూస్తున్నారు.

దీనిలో భాగంగా తెలుగు, త‌మిళ న‌టుల్ని సైతం భాగం చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే విల‌న్ గా సూర్య పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌భాస్ పేరు కూడా గ‌తంలో వైర‌ల్ అయింది. ప్రాజెక్ట్ మూవ్ అయితే ఇంకా చాలా పేర్లు తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే ఇంత‌వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఫైన‌ల్ కాలేదు. పాత ద‌ర్శ‌కుల్నే రిపీట్ చేస్తారా? కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? అన్నీ మీమాంస చాలా కాలంగా ఉంది.

అయితే `ధూమ్ -4` అంచనాలు ప‌తాక స్థాయికి తీసుకెళ్లేలా ఏకంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడినే ఎంపిక చేసారు. `వేక్ ఆఫ్ సిద్`, `బ్ర‌హ్మాస్త్ర` లాంటి చిత్రాల్ని డైరెక్ట‌ర్ చేసిన ఆయాన్ ముఖ‌ర్జీని ద‌ర్శ‌కుడిగా నిర్ణ‌యించి న‌ట్లు స‌మాచారం. అత‌డి మేకింగ్ స‌ర‌ళి న‌చ్చి య‌శ్ రాజ్ ఫిలిం అత‌న్ని క‌న్ప‌మ్ చేస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో `వార్ -2` భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో హృతిక్ రోష‌న్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఒకేసారి ఇద్ద‌రు టాప్ స్టార్ల‌ను ఈ సినిమా ద్వారా ఆయ‌న్ ముఖ‌ర్జీ హ్యాండిల్ చేస్తున్నాడు. దీంతో ఆదిత్య చోప్రా ఎంతో కాన్పిడెంట్ గా `ధూమ్ -4` కి ఆయ‌న్ అయితేనే క‌రెక్ట్ అని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో కూడా చాలా మంది స్టార్ హీరోలు భాగ‌మ‌వుతారు? అన్న‌ది తెలిసిందే.