Begin typing your search above and press return to search.

హీరో కుర్చీ ఎక్కితే ముగించేది ఇవే!

న‌టుడిగా బిజీగా ఉండ‌టం వ‌ల్లే కుద‌ర లేదు. 'డాన్ -3' షూటింగ్ వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. జీలే కూడా ప‌ట్టాలెక్కుతుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:30 PM GMT
హీరో కుర్చీ ఎక్కితే  ముగించేది ఇవే!
X

బాలీవుడ్ మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్హాన్ అక్త‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోగా, డైరెక్ట‌ర్ గా, రైట‌ర్ గా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప‌ర్స‌నాల్టీ. హీరోగా ఏ రేంజ్ లో స‌క్సెస్ అయ్యాడో? డైరెక్ట‌ర్ గానూ అంతే స‌క్సెస్ అయ్యాడు. అయితే కొంత కాలంగా న‌టుడిగా కొన‌సాగ‌డంతో ద‌ర్శ‌కత్వానికి దూర‌మ‌య్యారు. మ‌ధ్య‌లో ద‌ర్శ‌కుడిగా 'డాన్-3', 'జీలే లే జ‌రా' కూడా ప్ర‌క‌టించారు. కానీ అవి ఇంత‌వ‌ర‌కూ సెట్స్ కి వెళ్ల‌లేదు.

దీంతో ఆ సినిమాలు ఉన్నాయ్యా? ర‌ద్ద‌య్యాయా? అన్న‌ది కూడా క్లారిటీ లేదు. తాజాగా ఆ రెండు సినిమాల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. 'ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి ప‌దేళ్లు అవుతుంది. న‌టుడిగా బిజీగా ఉండ‌టం వ‌ల్లే కుద‌ర లేదు. 'డాన్ -3' షూటింగ్ వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. జీలే కూడా ప‌ట్టాలెక్కుతుంది. ఈ సినిమా ప్ర‌క‌ట‌నొచ్చి చాలా స‌మయం గ‌డిచిపోయింది. కానీ ఇంకా ప్రారంభించ‌లేదు. ఇందుకు నా అల‌స‌త్వం ఓ కార‌ణ‌మైతే సినిమాకి నేను ఒక్క‌డినే సిద్దంగా ఉంటే స‌రిపోదు.

ఎంతో మంది న‌టీన‌టులు కుద‌రాలి. వాళ్ల కాల్షీట్లు స‌ర్దుబాటు కావాలి. సాంక‌తిక నిపుణులు అనుకున్న వారు దొర‌కాలి. ఇవ‌న్నీ స‌వ్యంగా జ‌రిగిన‌ప్పుడే సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఎవ‌రో ఒక‌ర్నిపెట్టుకుని ప‌నిచేయ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. ఏ సినిమా చేసినా అది విజ‌యం న‌మోదు చేసేలా ఉండాలి. అంద‌కు నేను చేయాల్సిన అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తాను' అని అన్నారు.

'దిల్ చాహ‌త్ హై' సినిమాతో ప‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ త‌ర్వాత 'ల‌క్ష్య‌', 'డాన్: ది ఛేజ్ బిగెన్స్ ఎగైన్', 'డాన్: దికింగ్ ఈజ్ బ్యాక్ ఏగైన్' తో పాటు చాలా చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డాన్ సిరీస్ తో అక్త‌ర్ కి మంచి పేరొచ్చింది. అందుకే 'డాన్ -3' కూడా ప్ర‌క‌టించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ వుతుందా? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.