అంబానీ ఇంట గిప్టులు అంతా గ్యాసేనా?
అపరకుబేరుడు అంబానీ ఇంట వివాహానికి వెళ్లిన అతిధులందరికీ ఖరీదైన బహుమతులు అందించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2024 6:01 AM GMTఅపరకుబేరుడు అంబానీ ఇంట వివాహానికి వెళ్లిన అతిధులందరికీ ఖరీదైన బహుమతులు అందించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సెలబ్రిటీలందరికీ రెండు కోట్ల విలువ చేసే వాచీలు అంబానీ గిప్టులుగా ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలుసైతం నెట్టింట వైరల్ అయ్యాయి. మరి పెళ్లికి వెళ్లినవ వారు పెళ్లకొడుకు-పెళ్లి కూతురికి ఏ రకమైన గిప్టులు తీసుకెళ్లినట్లు చర్చ సాగింది.
అనంత్ అంబానీకి-రాధికా మర్చెంట్ కి బాలీవుడ్ సెలబ్రిటీఉ సైతం తమ స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఖరీదైన గిప్టులు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ లైఫ్ ప్రకారం షారుక్ ఖాన్ 40 కోట్ల విలువగల అగ్జరీ అపార్ట్ మెంట్ ను ప్రాన్స్ లో ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
ఇక సల్మాన్ ఖాన్ 15 కోట్ల విలువగల బైక్ , రణవీర్ సింగ్-దీపికా పదుకొణేలు 20 కోట్ల రోల్స్ రాయిస్, రణబీర్ కపూర్-అలియా భట్ జోడీ 9 కోట్ంల విలువ చేసే బెంజ్ కారు, కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ 19 లక్షల బంగారం చైన్, అక్షయ్ కుమార్ 60లక్షల విలువగల బంగారం పెన్ను బహుకరించినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది.
అయితే ఇదంతా బూటకపు ప్రచారమని మరికొంత మంది భావిస్తున్నారు. లక్షల కోట్ల అధిపతి అయిన అంబానీ ఇంట వేడుకకు వీళ్లంతా ఎందుకు అంత ఖరీదైన గిప్టులు ఇస్తారని అంటున్నారు. అంబానీ ఫ్యామిలీకి డబ్బు కరువా? లగ్జరీ జీవితానికి కొదవా? ప్రాన్స్ లో వాళ్లు ప్లాట్ లు కొనుక్కోలేరా? రోల్స్ రాయిస్ వాళ్ల ఇంట లేవనా? ఖరీదైన అపార్ట్ మెంట్లు అంబానీకి తక్కువ అయ్యాయనా? బాలీవుడ్ సెలబ్రిటీలు ఇదంతా చేస్తారని అంటున్నారు.
ఇవన్నీ తప్పుడు కథనాలని మెజార్టీ వర్గం భావిస్తోంది. నిజంగా అదే జరిగితే ఆ ప్రచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అంబానీ కేవలం వాళ్ల రాకను మాత్రమే ఆశించారని అది ఎంచక్కా జరిగిందన్నది వాస్తవం. సెలబ్రిటీలంతా వాళ్ల ఇంట పెళ్లిలా దగ్గరుండి జరిపించారు. అంబానీ కోసం అంతా కలిసి డాన్సులు చేసారు. అంతకు మించి నవ దంపతుల్ని అంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. అంతకు మించి అంబానీ కోరుకునేది ఏమీ ఉండదన్నది వాస్తవం.