బాలీవుడ్ నటుడు కుమారుడు టాలీవుడ్ లో హీరో!
అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి మాత్రం వాళ్లకి భిన్నంగా ఎంట్రీ ఇస్తున్నాడు.
By: Tupaki Desk | 17 Oct 2023 4:30 PM GMTఏ పరిశ్రమలోనైనా సొంత భాషలో ఉన్న గుర్తింపు ఇతర భాషల్లో అంతగా ఉండదు. అక్కడున్నన్ని పరిచయాలు..స్నేహాలు పరాయి భాషలో ఉండవు. అందుకే చాలా మంది నటులు వారసుల్ని సొంత పరిశ్రమల నుంచే లాంచ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఎంత మంది లాంచ్ అవుతున్నారో తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు హీరోలగా..హీరోయిన్లగా ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి మాత్రం వాళ్లకి భిన్నంగా ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ ని వదిలేసి నేరుగా టాలీవుడ్ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో 'నెనొక్కడినే' అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని మారుతి శ్యాంప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మిమో చక్రవర్తికి జోడీగా సశా నటిస్తోంది. ఇదొక థ్రిల్లర్ చిత్రం.
హీరో..హీరోయిన్ పాత్రలు తెరపై పోటా పోటీగా కనిపిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. జర్నలి జం..రాజకీయ అంశాల గురించి సినిమాలో చర్చించినట్లు తెలుస్తోంది. నవంబర్ 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ వెనుక ఓ స్ట్రాటజీ కనిపిస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్లాన్ లో నేరుగా టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా నుంచి ఇతర భాషల్లోకి వెళ్తే ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోలే టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇంకా ఇతర పరిశ్రమలో నటులు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చినా దూసుకొస్తున్నారు. చిన్న..పెద్ద అనే తేడా లేకుండా అవకాశం వస్తే రంగంలో దూకేస్తున్నారు. ఇవన్నీ గుర్తించిన మిమో చక్రవర్తి నేరుగా తెలుగులోకే ముందుగా దిగేస్తున్నాడు. మరి యంగ్ హీరోకి తొలి సినిమా ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.