అందుకేనా అలియాభట్ తండ్రి పేరు చెప్పదు!
బాలీవుడ్ దర్శక-నిర్మాత మహేష్ భట్ -సోనీ రజ్దాన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 2 Oct 2023 12:30 AM GMTబాలీవుడ్ దర్శక-నిర్మాత మహేష్ భట్ -సోనీ రజ్దాన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటుపై రాక్ స్టార్ రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుని కపూర్ ఇంట కోడలిగానూ అడుగు పెట్టింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో తెలుగులోనూ పాపులర్ అయింది. `గంగూబాయి కతియావాడి` లాంటి చిత్రంతో లేడీ ఓరియేటెండ్ నాయికగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
ఇప్పుడు కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. కొన్నేళ్ల పాటు అలియా బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోవడం ఖాయం. కపూర్ ఇంట కోడలి ఇమేజ్ కూడా ఉంది కాబట్టి! అలియా ఏం చేసినా చెల్లుతుంది. ఇదంతా ఇప్పుడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన చాలా కాలం పాటు మహేష్ భట్ పేరు పెద్దగా అలియా భట్ ఎక్కడా చెప్పింది లేదు. మహష్ భట్-అలియాభట్ కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్లో పెద్దగా వైరల్ అయిన సందర్భం లేదు.
ఈ విషయం చాలాసార్లు మీడియాలో హాట్ టాపిక్ గానూ మారింది. దీంతో తండ్రితో అలియాకి చెడిందా? అన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే అసలు సంగతి ఇదని తాజాగా అలియా భట్ మాటల్ని బట్టి తెలుస్తోంది. `గతంలో నాన్న చాలా సినిమాలు నిర్మించారు. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ సమయంలో ఆర్ధికంగా దెబ్బతిన్నాం. ఆ సమయంలో మద్యానికి బానిసయ్యారు. కొన్నాళ్లకు ఎలాగూ ఆ మత్తు నుంచి బయట పడ్డారు.
ఆ తర్వాత అమ్మ-నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. అన్నింటిని దాటుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారని` చెప్పుకొచ్చింది. అలియా మాటల్ని బట్టి ఆమె ఎదుగుదల విషయంలో మహేష్ భట్ చేసిందేం లేదని తెలుస్తోంది. తనకు తానుగానే ఇండస్ట్రీలో ఎందిగింది. వెనుక సపోర్ట్ ఉన్నా! తండ్రి సహకారం అలియాభట్ తీసుకున్నట్లు లేదని తెలుస్తోంది. అయితే తన ఎదుగుదల విషయంలో తల్లి మాత్రం స్పూర్తిగా నిలిచిందని తెలిపింది.
తన తల్లి పరిశ్రమకి వచ్చినప్పుడు ఎవరూ తెలియదని.. వచ్చిన అవకాశం వినియోగించుకుంటూ... టీవీ ఆపీసులు..సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగి కష్టపడిందని తెలిపింది. నటిగా సక్సెస్ అయ్యానంటే అందుకు అమ్మ ఇచ్చిన స్పూర్తి..కష్టం వలనే సాధ్యమైందని అలియాభట్ తెలిపింది.