అంత పెద్ద ఈవెంట్లో ఈ కునుకుపాట్లేంటి?
ఆలియా భట్ ఎల్లపుడూ హుషారుగా అల్లరిగా ఉండే అమ్మాయి.
By: Tupaki Desk | 15 Oct 2023 1:51 PM GMTఆలియా భట్ ఎల్లపుడూ హుషారుగా అల్లరిగా ఉండే అమ్మాయి. కానీ ఇప్పుడు ఇలా ఒక ముఖ్యమైన ఈవెంట్లో కునుకు తీస్తూ కనిపించేసరికి అది కాస్తా నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో శనివారం జరిగిన IOC ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, అలియా భట్, రణబీర్ కపూర్ సహా బాలీవుడ్ దిగ్గజాలంతా ఒకే చోట కొలువు దీరారు. 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ప్రారంభోత్సవంలో దిగ్గజాలు ఉన్న చోట తాను నిదురపోతూ కనిపించడం ఆశ్చర్యపరిచింది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
దీపికా పదుకొణె పక్కన షారూఖ్ ఖాన్ కూర్చోగా, వారి వెనుక ఆలియా భట్, రణబీర్ కపూర్ కూర్చున్నారు. రెడ్డిట్‌లోని చాలా మంది ఈ ఫోటోపై స్పందిస్తూ.. ఆలియా నిద్రలో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈవెంట్లో నలుపు రంగు సూట్‌లో షారుఖ్ ఖాన్ స్మార్ట్ గా కనిపించగా, గ్రే ప్యాంట్‌లో బాస్ లేడీ వైబ్స్ ఇచ్చిన దీపికతో చాట్ చేస్తూ కనిపిస్తున్నాడు. అలియా భట్ -రణబీర్ ఇద్దరూ ఎథ్నిక్ లుక్స్‌లో ఉన్నారు. ఈ ఫోటోపై వ్యాఖ్యానిస్తూ, ఒక రెడ్డిట్ ఇలా రాశాడు. ``కార్యక్రమంలో అందరూ విసుగు చెందారు... ఆలియా అక్షరాలా నిద్రపోతోంది... ఆమెను నిందించవద్దు. నేను కూడా అదే చేస్తాను. షారూఖ్ - దీపికా ఇద్దరూ ప్రొఫెషనల్‌గా ఉన్నారు కానీ ఐడిసి (నేను శ్రద్ధ చేయను) ని చూడండి`` అని అన్నారు. ఇంకొకరు ఇలా చమత్కరించారు. ఆలియా ఈ ప్రపంచాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నిద్రపోతోంది. రణబీర్ నిజమైన బ్యాక్‌బెంచర్ లాగా ఫోన్‌లో పడిపోయాడు. షారూఖ్ పూర్తి శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తున్నాడు. కానీ అతని మనస్సు చాలావరకు ఎక్కడో తిరుగుతోంది. అయితే దీపిక హెర్మియోన్ గ్రాంజర్ వైబ్‌లను ఇస్తోంది. (ఎమ్మా వాట్సన్ హ్యారీ పోటర్ పాత్ర)... అంటూ చాలా కామిక్‌గా వారిని వర్ణించాడు.
IOC ఈవెంట్ గురించి..
ముంబైలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. IOC సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యుల కీలక సమావేశంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ రెండోసారి ఐఓసీ సెషన్‌కు ఆతిథ్యమిచ్చింది. IOC 86వ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి అవకాశం కలిగింది.