Begin typing your search above and press return to search.

టార్చ‌ర్ త‌ట్టుకోలేక డిలీట్ చేసిందా?

`సూప‌ర్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన క్యూటీ అయేషా టాకియా సుప‌రిచితే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:03 AM GMT
టార్చ‌ర్ త‌ట్టుకోలేక డిలీట్ చేసిందా?
X

`సూప‌ర్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన క్యూటీ అయేషా టాకియా సుప‌రిచితే. తొలి సినిమాతోనే అమ్మ‌డికి మంచి ఫాలోయింగ్ మొద‌లైంది. త‌ర్వాత తెలుగులో సినిమాలు కంటున్యూ చేయ‌లేదుగానీ అమ్మ‌డి క్యూట్ లుక్ చాలా మంది అభిమానులున్నారు. ఇక బాలీవుడ్ కి దూర‌మై 14 ఏళ్లు అవుతుంది. కానీ నెట్టింట మాత్రం యాక్టివ్ గానే ఉంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు పోస్ట్ చేసి అభిమానుల్ని అల‌రిస్తుంది.


అయితే తాజాగా అమ్మ‌డు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని డిలీడ్ చేసింది. నెట్టింట ట్రోలింగ్ త‌ట్టుకోలేక అమ్మ‌డు డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లే అయేషా ఇన్ స్టాలో త‌న లేటెస్ట్ ఫోటోలు కొన్ని పోస్ట్ చేసింది. అందులో నీలిరంగు చీర ధ‌రించి క‌నిపించారు. చెంప‌లు ప‌ల్చ‌బ‌డి గుర్తు ప‌ట్టలేనంత‌గా రూపం మారిపోయింది. ఆమెని ఆలా చూసి ఒక్క‌సారిగా షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి.

పేరు చూసి గుర్తుప‌ట్టాల్సి వ‌చ్చింది. లేదంటే అయేషా అన్న సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు అందులో అమ్మ‌డి ముఖంలో అంత మార్పు చోటు చేసుకుంది. దీంతో అమ్మ‌డు ట్రోల‌ర్ల‌కు టార్గెట్ గా మారింది. ఈవిడ అయేషానా? లేక విదేశీ భామ‌నా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మార్పులొచ్చినా? మ‌రీ ఇంత‌లా గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుందా? అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎవ‌రి స్టైల్లో వారు పోస్ట్ లు..కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఆ టార్చ‌ర్ త‌ట్టుకోలేక అమ్మ‌డు ఇన్ స్టా ఖాతాని డిలీట్ చేసింది. మరి ఈ హ‌డావుడి అంతా త‌గ్గిన త‌ర్వాత యాక్టివేట్ చేస్తుందా? లేక ప‌ర్మినెంట్ గా డిలీట్ చేసిందా? అన్న‌ది చూడాలి. ఈ అమ్మ‌డు `టార్జ‌న్ ది వండ‌ర్ కార్` తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటుపై కొన్నేళ్ల పాటు తిరుగు లేకుండా కెరీర్ సాగించింది.