Begin typing your search above and press return to search.

48 వ‌య‌సులో మ‌లైకా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్

లేటు వ‌య‌సులో ఘాటు అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది మ‌లైకా అరోరాఖాన్.

By:  Tupaki Desk   |   10 Aug 2024 4:16 AM GMT
48 వ‌య‌సులో మ‌లైకా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్
X

లేటు వ‌య‌సులో ఘాటు అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది మ‌లైకా అరోరాఖాన్. వ‌య‌సు 48 అయినా ఇంకా 26 లోనే కాలం ఆగిపోయిందా? అనిపిస్తుంది. త‌న‌కంటే ఏజ్ లో 8ఏళ్ల చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేసిన మ‌లైకా ఎప్ప‌టికీ త‌న అల్ట్రా గ్లామ్ లుక్ లో మార్పులు లేకుండా మ్యానేజ్ చేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.


ఇటీవ‌లే అర్జున్ తో బ్రేక‌ప్ అయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లోనే విదేశీ వెకేష‌న్ లో మ‌లైకాతో పాటు షాడో మ్యాన్ ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. మ‌రోవైపు మ‌లైకా వ‌రుస ఫోటోషూట్లు వెబ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాజాగా ప్ర‌ఖ్యాత హార్ప‌ర్ బజార్ క‌వ‌ర్ పేజీపై మ‌లైకా ఫోజులు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ రూపంతో ఈ బ్యూటీ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. బ‌జార్ ఇండియా ఈ ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేయ‌డ‌మే గాక‌.. మ‌లైకాకు విష్ చేసింది.

మీరు 48 ఏళ్ల వయస్సులో అద్భుతంగా కనిపిస్తున్నారు! అని ఎవరైనా చెప్పినప్పుడు అది అద్భుతంగా అనిపిస్తుంది. ప్రజలు దానిని అవమానకరమైన రీతిలో అర్థం చేసుకున్నారని నేను అనుకోను. ఇది ఒక అభినందన... అని మ‌లైకా అన్నారు. 48 ఏళ్ళ వయసులో, నేను ఎలా ఉన్నానో అలా చూడగలిగితే, అది నా కృషి, అంకితభావం, ఏకాగ్రత వల్లనే ఫలితం లభిస్తోంది అని అర్థం చేసుకున్న‌ట్టు అని అన్నారు.

తన జీవితంలోని ఏ అంశాన్ని తేలికగా తీసుకోన‌ని, తనకు రోజువారీ నిబద్ధత చాలా ముఖ్య‌మ‌ని మ‌లైకా పేర్కొంది. ``అలా యంగ్ గా ఉండడానికి మీరు ఏమి చేస్తారు? అని ఎవరైనా అడిగినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుందని కూడా మ‌ల్లా అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న గ్లామ‌ర్ ర‌హ‌స్యాల‌ను కూడా మ‌లైకా హార్ప‌ర్ బ‌జార్ తో షేర్ చేసుకుంది. ద‌క్షిణ అమెరికాలోని ఒక అరుదైన చికిత్స గురించి కూడా ప్ర‌స్థావించింది. ఏ ఇతర మహిళల్లాగే, నాకు సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్స్, బరువు హెచ్చుతగ్గులు, హార్మోన్ల సమస్యలు ఉన్నాయి. నేను నా ప‌నిలో నేను మునిగిపోతాను. మంచి రోజుల్లో నేను ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతాను. నా వంతు కృషి చేస్తూనే ఉంటాను.. అని తెలిపారు. .