Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : చీర కట్టులో సింపుల్‌ అండ్ స్వీట్‌ రకుల్‌

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

By:  Tupaki Desk   |   24 July 2024 10:26 AM GMT
పిక్‌ టాక్‌ : చీర కట్టులో సింపుల్‌ అండ్ స్వీట్‌ రకుల్‌
X

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన విషయం తెల్సిందే.


ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించేందుకు డేట్లు లేవు అంటూ నో చెప్పింది. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించింది. మొత్తానికి టాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో మోస్ట్‌ సక్సెస్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్ గా నిలిచిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఆఫర్లు లేక ఢీలా పడింది.


ఆఫర్లు లేకున్నా తన అందం విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. ఎలాంటి ఔట్ ఫిట్‌ లో అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కన్నుల విందు చేస్తూనే ఉంటుంది.

తాజాగా మరోసారి రకుల్‌ ప్రీత్ సింగ్‌ చీర కట్టులో తన ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ కి కన్నుల విందు చేసింది. ఇంతటి అందగత్తె అంటూ రకుల్‌ ను గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. సింపుల్‌ అండ్‌ స్వీట్‌ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే అందంతో పాటు చీర కట్టు లో సింపుల్ గా ఉన్న రకుల్‌ ను చూస్తే ఎంతటి ఫిల్మ్‌ మేకర్‌ అయినా పిలిచి ఆఫర్‌ ఇవ్వాల్సిందే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందు ముందు ఈ అమ్మడు సినిమాల్లో మళ్లీ బిజీ అవ్వాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ ఉపయోగపడుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.