Begin typing your search above and press return to search.

స‌న్నీలియోన్ స్ట‌న్నింగ్ ఫోటోషూట్

పెద్ద తెర నుంచి కొన్నాళ్లుగా దూరంగా ఉన్న స‌న్నీలియోన్ త‌న సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   26 Aug 2024 3:35 AM GMT
స‌న్నీలియోన్ స్ట‌న్నింగ్ ఫోటోషూట్
X

పెద్ద తెర నుంచి కొన్నాళ్లుగా దూరంగా ఉన్న స‌న్నీలియోన్ త‌న సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. అక్క‌డ వేడెక్కించే ఫోటో/ వీడియో ట్రీట్ కి కొద‌వేమీ లేదు. కొంత కాలంగా స‌న్నీలియోన్ కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఫుల్ జోష్ లో క‌నిపిస్తోంది. ఈ ఏడాది సన్నీలియోన్‌కి క్ష‌ణం తీరిక లేనంత‌ షెడ్యూల్ ఉంది. తనూజ్ విర్వానీతో కలిసి డేటింగ్ రియాలిటీ షో ఎంటివి స్ప్లిట్స్‌విల్లా X5 తో ఓవైపు బిజీ బిజీ. మ‌రోవైపు ఉపేంద్ర‌తో క‌లిసి కన్నడ చిత్రం UI చిత్రీకరణలోను బిజీ.


వ‌రుస ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఇంత‌టి బిజీ షెడ్యూల్ న‌డుమ స‌న్నీలియోన్ ఇటీవల విమానాశ్రయంలో కనిపించింది. అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌తో తన సోదరుడి బిడ్డ రాక గురించి శుభవార్తను షేర్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. `మేరే భాయ్ కా చోటా బేబీ అయా` అంటూ హిందీ మాండలికం మిస్ అవ్వకుండా చెప్పేందుకు ప్ర‌య‌త్నించింది. త్వ‌ర‌లోనే స్వీట్లు పంచుతాన‌ని కూడా చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.


ఇంత‌లోనే స‌న్నీ అగ్గి రాజేసే ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. శృంగార తార స‌న్నీలియోన్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేష‌న్ లుక్ లో క‌నిపించింది. మ‌త్తెక్కించే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ గ్రీన్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ ని ధ‌రించిన స‌న్నీలియోన్ దానిపై డార్క్ గ్రీన్ బ్లేజ‌ర్ ని ధ‌రించి స్పెష‌ల్ గా క‌నిపించింది. హితేంద్ర క‌పూరా ఈ లుక్ కి స్టైలింగ్ చేసారు. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. అలాగే స‌న్నీలియోన్ సోద‌రుడు సందీప్ వోహ్రా త‌న భార్య క‌రిష్మా, బిడ్డ‌తో క‌లిసి ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో దూసుకెళుతున్నాయి.


కెరీర్ ప‌రంగా చూస్తే... సన్నీ లియోన్ కన్నడ చిత్రం UI లో న‌టిస్తోంది. ఆమెతో పాటు ఈ చిత్రంలో మురళీ శర్మ, అష్రఫ్, ఉపేంద్ర, పి రవిశంకర్, అచ్యుత్ కుమార్, సాధు కోకిల, నిధి సుబ్బయ్య కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.