Begin typing your search above and press return to search.

తెల్ల చీర‌లో తాప్సీ పువ్వందం!

ఉత్త‌రాది అభిమానుల అభిరుచుకి త‌గ్గ‌ట్టు ఇప్ప‌టికే రూప లావ‌ణ్యంలో ఎన్నోమార్పులు చేసింది.

By:  Tupaki Desk   |   28 July 2024 11:01 AM GMT
తెల్ల చీర‌లో తాప్సీ పువ్వందం!
X

తాప్సీ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రోఫెష‌న‌ల్ గా ఎంత బిజీగా ఉన్నా ప్ర‌యివేట్ ఫోటోల‌తోనూ అల‌రించ‌డం అమ్మ‌డి స్పెషాల్టీ. బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి ఈ రూల్ తూచ త‌ప్ప‌కుండా ఫాలో అవుతోంది. అక్క‌డి ట్రెండ్ ని అనుస‌రిస్తూ గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌ద‌మైన మార్క్ ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకున్న సంద‌ర్భాలెన్నో.


ఉత్త‌రాది అభిమానుల అభిరుచుకి త‌గ్గ‌ట్టు ఇప్ప‌టికే రూప లావ‌ణ్యంలో ఎన్నోమార్పులు చేసింది. మోడ్ర‌న్ దుస్తుల్లో సెగ‌లు మురిపిస్తుంది. తాజాగా అమ్మ‌డు చీరందంలో త‌ళుక్కున మెరిసింది. పాల‌నురుగ‌ల సౌంద‌ర్యంపై తెలుపు వ‌ర్ణం- గులాబీ రంగు పువ్వున్న చీర‌ను ధ‌రించింది. చీరందంలో తాప్సీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. వైట్ స్కిన్ పై వైట్ సారీ వావ్ లో అనిపిస్తోంది. చీరని మ్యాచ్ చేస్తూ అంద‌మైన జ‌డ‌ను అల్లుకుంది.


చేతిలో తెలుపు వ‌ర్ణం పువ్వు ను చూస్తూ ..పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వును చిందిస్తూ కెమారాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు తాప్సీ అందానికి పుల్ల‌కించి పోతున్నారు. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే కొంత కాలంగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో బెట‌ర్ గానే కొన‌సాగుతుంది.


అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ‌ని సైతం స్థాపించి ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు నిర్మిస్తుంది. అక్కడి సెల‌బ్రిటీలంద‌రితో అంతే మింగిల్ అవుతుంది. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక వేసుకుని వెళ్తుంది. గ‌త ఏడాది ఒకే ఒక్క సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా ఈ ఏడాది మాత్రం నాలుగైదు సినిమాలో రావ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే కొన్ని క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి షూటింగ్ దశ‌లో ఉన్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. లాక్ అయితే ఏడాది ముగింపుక‌ల్లా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తోంది.