Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల ఎర్ర గులాబీ

బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఈ అమ్మడు నిలిచింది.

By:  Tupaki Desk   |   24 July 2024 7:52 AM GMT
పిక్ టాక్‌ : అందాల ఎర్ర గులాబీ
X

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా కూడా దక్కని గుర్తింపు బాలీవుడ్‌ లో చేసిన సినిమాలో దక్కింది. దాంతో బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్‌ అయ్యింది. అప్పుడప్పుడు సౌత్‌ లో మెరుస్తోంది.


బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఈ అమ్మడు నిలిచింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అనగానే ఈ అమ్మడు గుర్తుకు వచ్చే స్థాయిలో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఎర్ర చీర కట్టు తో చేతిలో ఎర్ర గులాబీ ధరించిన ముద్దుగుమ్మ తాప్సి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

విభిన్నమైన ఎర్ర చీర కట్టు అందాలతో తాప్సి షేర్‌ చేసిన ఈ పోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా అందం విషయంలో ఈ అమ్మడు పాతికేళ్ల పడుచు అమ్మాయి అనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.