Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : యానిమల్‌ బ్యూటీ సెన్షేషనల్‌ క్లిక్స్‌

పోస్టర్ బాయ్స్ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ తృప్తి డిమ్రి.

By:  Tupaki Desk   |   6 Aug 2024 12:30 PM GMT
పిక్ టాక్ : యానిమల్‌ బ్యూటీ సెన్షేషనల్‌ క్లిక్స్‌
X

పోస్టర్ బాయ్స్ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ తృప్తి డిమ్రి. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా సరైన అవకాశాలు రాలేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సందీప్ రెడ్డి వంగ ఈమెకు యానిమల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. రణబీర్ కపూర్‌ తో ఈ అమ్మడు చేసిన రొమాన్స్‌ కారణంగానే అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.


2020 లో మోస్ట్‌ డిజైరబుల్ ఉమెన్ లిస్‌ లో ఇండియా లో 20 వ స్థానంలో నిలిచిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో గుర్తింపును దక్కించుకుంటూ, ఆఫర్లు సొంతం చేసుకుంటూ వచ్చింది. యానిమల్‌ సినిమాతో ఈ అమ్మడి కెరీర్‌ యూటర్న్‌ తీసుకున్నంత స్పీడ్‌ అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడి చేతికి ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా విక్కీ కౌశల్‌ కి జోడీగా బ్యాడ్‌ న్యూస్ సినిమాలో నటించింది.


విక్కీ కౌశల్ తో ఈ అమ్మడు చేసిన బ్యాడ్‌ న్యూస్ సినిమాలోని తోబతోబ సాంగ్ బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పాటకు డాన్స్ లు చేస్తున్నారు. విక్కీ కౌశల్‌ అద్భుతమైన స్టెప్స్‌ ను ఈ పాటకు వేశాడు అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. ఎంతో మంది విక్కీ కౌశల్‌ వేసిన స్టెప్స్‌ ను అనుకరించడం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు.

ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన స్టిల్స్ ను తృప్తి డిమ్రి షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా అందమైన ఈ అమ్మడు పాట కోసం మరింత అందంగా కనిపించేందుకు ఔట్‌ ఫిట్‌ లో అలరించింది. అంతే కాకుండా ఈ అమ్మడు విక్కీ కౌశల్‌ కి ఏమాత్రం తగ్గకుండా నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుందని, డాన్స్ విషయంలో కూడా దుమ్ము రేపింది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి గ్రేస్‌ ఉన్న డాన్సర్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే ఎప్పటిలాగే కొందరు మాత్రం ఈ అమ్మడి డాన్స్ ను ట్రోల్‌ చేస్తున్నారు. ట్రోల్స్ ను పట్టించుకోకుండా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తోబతోబ సాంగ్‌ కి సంబంధించిన స్టిల్స్ మరియు మేకింగ్ వీడియోను షేర్‌ చేస్తూనే ఉంది. ముందు ముందు వీరిద్దరి కాంబోలో పలు సినిమాలు రావాలని అలాగే మంచి పాటలు కూడా రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.