అమీర్ ఖాన్ కి కూడా ఆ సమస్య ఉందా?
కాగా నేడు ప్రపంచ మానసిక దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ఓ వీడియోని రిలీజ్ చేసారు.
By: Tupaki Desk | 10 Oct 2023 12:48 PM GMTమానసిక రుగ్మత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిం దే. డే బై డే మానసిక సమస్యలతో తనువు చాలిస్తోన్న వారి సంఖ్య గణణీయంగా పెరుగుతుంది. రకరకాల సమస్యలతో ఒత్తిడికి గురవ్వడంతోనే మానసిక రోగిగా మారాల్సి వస్తోంది. కాగా నేడు ప్రపంచ మానసిక దినోత్సవం. ఈసందర్భంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ఓ వీడియోని రిలీజ్ చేసారు.
తాను..తన కుమార్తె ఐరాఖాన్ ఎన్నో ఏళ్లగా మానసిక సమస్యల్ని ఎదుర్కుంటున్నట్లు మరోసారి గుర్తు చేసారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా థెరపీ తీసుకుంటున్నామని..ఇలాంటి సమస్యలుంటే ఇంట్లో చెప్పాల్సిందేనని...ఇందులో సిగ్గు పడాల్సిన పరిస్థితి లేదని అన్నారు. లెక్కలు నేర్చుకోవాలంటే స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ దగ్గరకు వెళ్తాం. హెయిర్ కట్ చేయించుకోవాలంటే సెలూన్ కి వెళ్తాం.
అలాగే ఏ పని నేర్చుకోవాలన్నా..తెలుసుకోవాలన్న ఆవృత్తిలో ప్రావీణ్యం సంపాదించిన వారి దగ్గరకు వెళ్లి సమస్యని పరిష్కరించుకుంటాం. కానీ జీవితంలో మనం చేయలేనివి...చేసుకోలేని పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ పని తెలిసిన వారి సహాయం తీసుకోవడం ఎంతైనా అవసరం. మానసిక సమస్యని ఎదుర్కుం టున్న వారు తమ వ్యధని తామే ముందుగా గుర్తించి ఆయా నిపుణుల దగ్గరకు వెళ్లాలి.
అందుకు అవసరమైన ప్రత్యేక థెరఫీలు చేయించుకోవాలి` అని అన్నారు. అమీర్ ఖాన్ -ఐరాఖాన్ సొంతంగా ఓ థెరఫీ సెంటర్ ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మానసిక సమస్యలున్న వారికి అందులోనే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. కొన్నేళ్లగా ఈ సేవల్ని ఐరాఖాన్ దగ్గరుండి అంది స్తున్నారు.
ఆమె కూడా మానసిక రుగ్మతని ఎదుర్కంటుంది. తనలా మిగతా వారు అనారోగ్యానికి గురికాకూడదని ఓ ఛారిటీ తరుపున ఈ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ పెద్ద కుమార్తె మీరా మానసిక సమస్యతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.