రివ్యూలు చెప్పకుండా డబ్బులిచ్చి ఆపేస్తున్నారు!
బాలీవుడ్ సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి డ్యాష్ అండ్ డేరింగ్ కామెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 24 Sep 2023 11:15 AM GMTబాలీవుడ్ సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి డ్యాష్ అండ్ డేరింగ్ కామెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంశంపైనైనా తనదైన శైలిలో స్పందించి సంచలనమవుతుంటారు. తన సినిమా సంగతులతో పాటు..పరిశ్రమలో లోపాల్ని ఎత్తి చూపుతూ తనదైన శైలిలో పంచ్ లు విసురుతుంటారు. తాజాగా మరోసారి వార్తల్లో అగ్ర స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన `వ్యాక్సిన్ వార్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ..ప్రభుత్వాలు ఎంతగా శ్రమించాయో తెలిసిందే. ఆ సంగతులతో పాటు..తనదైన శైలి వాస్తవాల్ని సినిమా ద్వారా చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకట నుంచే కొన్ని రకాల విమర్శల్ని ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి నాలుగు రోజులు సమయం ఉందనగా వివేక్ సంచలన ఆరోపణలు చేసారు.
చిత్ర పరిశ్రమత తన సినిమాపై నిషేధం విధించినట్లు ఉందని..అందుకే ఎవరూ మాట్లాడటం లేదని ఆరోపించారు. తన సినిమాకి రివ్యూలు చెప్పకుండా ఉండేదుకు వాళ్లకి అడ్డులిచ్చి అడ్డుతగులుతున్నారని అన్నారు. `నేను బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకం కాదు. `ది కశ్మీర్ ఫైల్స్` విజయం సాధించిన తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని పేరు పొందిన నిర్మాణ సంస్థలు..వ్యక్తులు నన్ను సంప్రదించారు.
300 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యారు. కానీ నేను వాళ్ల ఉచ్చులో చిక్కుకోలేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కోసం పాటు పడిన శాస్త్రవేత్తల శ్రమని తెలియజేయాలనుకున్నా. అందుకే తక్కువ బడ్జెట్ లోనే వ్యాక్సిన్ వార్ చేసాను. కశ్మీర్ ఫైల్స్ కోసం వచ్చిన లాభాలు ఈ సినిమా కోసం ఖర్చు చేసాను. ఈసినిమా మంచి ఫలితాలు సాధించకపోతే నా పరిస్థితి మళ్లీ గతం తరహాలోనే ఉంటుందని` అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గామారాయి. అగ్నిహోత్రి సినిమాపై నిజంగా బాలీవుడ్ కక్ష పూరి చర్యలకు పూనుకుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాక్సిన్ పై సినిమా తీస్తే ఇంతవరకూ ఎవరూ స్పందికపోవడం ఆశ్చర్యంగా ఉందని వివేక్ సన్నిహితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.