Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సిండికేట్ సెల్ఫ్ గోల్

ద‌క్షిణాది నుంచి వ‌చ్చే కంటెంట్ ని నిలువ‌రించేందుకు హిందీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ప‌న్నాగాలు ప‌న్నుతున్నారా?

By:  Tupaki Desk   |   22 Oct 2023 7:28 AM GMT
బాలీవుడ్ సిండికేట్ సెల్ఫ్ గోల్
X

ద‌క్షిణాది నుంచి వ‌చ్చే కంటెంట్ ని నిలువ‌రించేందుకు హిందీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ప‌న్నాగాలు ప‌న్నుతున్నారా? అంటే.. దీనిని వంద‌శాతం ధృవీక‌రించ‌లేం. అయితే కొంద‌రు హిందీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు.. పెద్ద థియేటర్ చైన్‌లు తమ థియేటర్‌లలో సినిమాను ప్రదర్శించాలంటే 8 వారాల OTT విడుదల నియ‌మాన్ని పాటించాల‌ని నిబంధనను విధించింది. దాని ప్ర‌కార‌మే థియేటర్లలో విడుదల చేస్తారు. విడుద‌లైన రోజు నుంచి ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి. ఈ త‌ర‌హా ఒప్పందంలో పీవీఆర్ ఐనాక్స్, సినీపోలీస్ కూడా క‌ట్టుబ‌డి ఉన్నాయి.

స‌రిగ్గా ఇదే కార‌ణంతో ఇటీవ‌ల ద‌క్షిణాది నుంచి హిందీ చిత్ర‌సీమ‌కు వెళుతున్న అనువాద‌ సినిమాలకు ముప్ప త‌ప్ప‌డం లేదు. ఈ నియంత్రణలో భాగంగా PVR ఐనాక్స్, సినీపోలిస్ ఇతర థియేటర్ దిగ్గజాలు ఈ చిత్రానికి 8 వారాల OTT విడుదల ఒప్పందం లేని కారణంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ `లియో`ను విడుదలకు అనుమ‌తించ‌లేదు. లియోకి బదులుగా గణపత్ అనే హిందీ చిత్రాన్ని ఈ సిండికేట్ విడుదల చేసింది. కానీ ఈ సిండికేట్ తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా ప‌రిస్థితి తారుమారైంది. హిందీ బెల్ట్‌లోని కొన్ని సింగిల్ స్క్రీన్‌ల నుండి లియో సాధించిన వ‌సూళ్ల‌తో పోలిస్తే.. గణపత్ మొత్తం కలెక్షన్ లు దిగ‌దుడుపుగా ఉన్నాయి. సినిమా టిక్కెట్లు, స్నాక్స్ కోసం అధిక ధరలు వసూలు చేస్తున్నందున థియేట‌ర్ చైన్ వ్య‌వ‌స్థ బాగా ఆర్జించే వీలుంది. దీంతో ఒక విష‌యాన్ని అర్థం చేసుకోవాలి. కంటెంట్ లేని సినిమాని మ‌ల్టీప్లెక్స్ ల్లో విడుద‌ల చేసినా ప్ర‌యోజ‌నం శూన్యమ‌ని ఇప్పుడు గ‌ణ‌ప‌త్ నిరూపిస్తోంది. సినిమా చైన్‌ల 8 వారాల OTT ఒప్పందం వారి జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందనేది ఇప్పుడు సాధారణ చర్చ.

సినిమా చైన్ ల దురాశకు చెప్పు దెబ్బ త‌గిలింద‌నేది ట్రేడ్ విశ్లేష‌ణ‌. ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో బ‌జ్ ఉన్న `లియో`ని కాద‌ని `గణపత్`ని రిలీజ్ చేసినందుకు మ‌ల్టీప్లెక్సులకు దెబ్బ ప‌డిపోయింద‌ని విశ్లేషిస్తున్నారు. కేవ‌లం టికెట్ ధ‌ర పెద్ద‌గా ఉండ‌డం వ‌ల్ల వ‌చ్చే డ‌బ్బు త‌ప్ప సినిమా బాగా ఆడ‌టం జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో జోష్ వ‌ల్ల మాత్రం బాగు ప‌డే ఆస్కారం లేద‌ని చెబుతున్నారు. స‌ద‌రు థియేట‌ర్ చైన్ లు `గణపత్‌`ను కొన్ని వారాలపాటు ప్రతిరోజూ నష్టాలతో విడుదల చేయవలసి ఉంటుంది. నిజానికి లియోకి మిశ్రమ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ సింగిల్ థియేట‌ర్ల‌తోనే స‌రిపుచ్చుకుని ఉత్త‌రాదినా భారీగా వ‌సూలు చేస్తోంది. లియో మొద‌టి రోజు ద‌ళ‌ప‌తి విజ‌య్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా 130కోట్లు వ‌సూలు చేసింద‌ని టాక్ ఉంది.