బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ కి దిగిరారా?
రాజమౌళికి బాలీవుడ్ అవకాశాలిచ్చినా ఆయన మాతృభాషపై మమకారంతో ఇక్కడే సినిమాలు చేస్తు న్నారు. బాలీవుడ్ హీరోల్నే ఇక్కడికి రప్పిస్తున్నారు
By: Tupaki Desk | 15 Nov 2023 11:30 PM GMTదక్షిణాదిన అన్నిపరిశ్రమల దర్శక-నటులు దాదాపు టాలీవుడ్ లో సేవలందిస్తున్నారు. తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఇప్పుడంతా తెలుగు లో ఛాన్సు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. మొన్నటివరకూ హైదరాబాద్ కి ప్రచారానికి రాని కొంత మంది కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగు దర్శకులు ఛాన్స్ ఎప్పుడు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. దాదాపు సౌత్ మేకర్స్ అంతా తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు.
మరి బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ కి దిగిరారా? అంటే అందుకు కూడా సమయం దగ్గర్లోనే ఉంది. ఇప్పటికే తెలుగు హీరోల్ని ఎలాగైనా హిందీ సినిమాల్లో భాగం చేసి మార్కెట్ చేసుకోవాలని బాలీవుడ్ హీరోలు చూస్తోన్న సంగతి తెలిసిందే. అవసరమైతే తెలుగు సినిమాలు చేసి వాళ్లతో సాన్నిహిత్యాన్ని పెంచుకో వాలని చూస్తున్న హీరోలున్నారు. అమీర్ ఖాన్..షారుక్ ఖాన్...సల్మాన్ ఖాన్ నటులకు రాజమౌళి లాంటి డైరెక్టర్ అవకాశం ఇవ్వాలే గానీ సినిమా చేయడానికి సిద్దమే.
రాజమౌళికి బాలీవుడ్ అవకాశాలిచ్చినా ఆయన మాతృభాషపై మమకారంతో ఇక్కడే సినిమాలు చేస్తు న్నారు. బాలీవుడ్ హీరోల్నే ఇక్కడికి రప్పిస్తున్నారు. మన హీరోలు కూడా బాలీవుడ్ మేకర్స్ ని టాలీవుడ్ కి రప్పించడానికి ఇంకెంతో సమయం లేదు. రామ్ చరణ్..తారక్..ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు హాలీవుడ్ లోనే పరిచయయ్యారు. చరణ్..తారక్ కి అక్కడ నుంచి పిలుపొస్తుంది. ప్రభాస్ లాంటి మేకర్ బాలీవుడ్ దర్శకులతోనూ పనిచేసాడు. అయితే ఫస్ట్ క్లాస్ డైరెక్టర్లు మాత్రం తెలుగు సినిమాలు చేసింది లేదు.
తెలుగు హీరోల్ని డైరెక్ట్ చేయాలని మనసులో కోరిక ఉన్నా! దిగి రాలేకపోతున్నారు. అయితే ఆ కోరికను ఇంకెంతో కాలం దాచి పెట్టలేరు. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా బాలీవుడ్ ని పక్కకు నెట్టి టాలీవుడ్ నిలిచింది. 2024 లోనైనా తిరిగి తమ స్థానం దక్కించుకోవాలని బాలీవుడ్ ప్రయత్నిస్తుంది. కానీ రాజమౌళి..ప్రశాంత్ నీల్ లాంటి అసాధారణ మేకర్స్ రేసులో ఉన్నంత కాలం సన్నివేశం పోటాపోటీగానే ఉంటుంది.