Begin typing your search above and press return to search.

ఆ రెండు విజ‌యాల‌కు థర్డ్ ఇన్ స్టాల్ మెంట్!

తాజాగా 'జాలీ ఎల్ ఎల్ బీ'...'భూల్ భుల‌య్య' చిత్రాల‌కు థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కు రంగం సిద్ద‌మ‌వుతుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 6:08 AM GMT
ఆ రెండు విజ‌యాల‌కు థర్డ్ ఇన్ స్టాల్ మెంట్!
X

బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఆ సినిమాకి ఎన్ని సీక్వెల్స్ అయినా పుడ‌తాయి. 20 ఏళ్ల క్రితం క‌థ‌ల్ని సైతం త‌వ్వి తీసి సీక్వెల్స్ చేసి హిట్ అందుకుంటున్నారు. ఈ ర‌క‌మైన స‌క్సెస్ అనేది బాలీవుడ్ కి మాత్ర‌మే సొంత‌మైంది. అందుకే హిందీ ప‌రిశ్ర‌మ నుంచి త‌రుచూ సీక్వెల్స్ వ‌స్తుంటాయి. బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి.-

తాజాగా 'జాలీ ఎల్ ఎల్ బీ'...'భూల్ భుల‌య్య' చిత్రాల‌కు థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కు రంగం సిద్ద‌మ‌వుతుంది. అక్ష‌య్ కుమార్ న‌టించిన 'జాలీ ఎల్ ఎల్ బీ' ప్రాంచైజీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. కోర్టు వార్ డ్రామ‌గా సుభాష్ క‌పూర్ తెర‌కెక్కించిన రెండు భాగాలు చ‌క్క‌ని విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో 'జాలీ ఎల్ ఎల్ బీ-3' కూడా రెడీ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే స్క్రీన్ ప్లే కూడా సిద్ద‌మైంది. ఏడాది చివ‌ర్లో సినిమాకి సంబంధించిన ప‌నులు పూర్తి స్థాయిలో మొద‌లు కానున్నాయి. ఇందులో య‌ధావిధిగా అక్షయ్ కుమార్.. అర్ష‌ద్ వార్షి న‌టించ‌నున్నారు. వినోదం..ఉత్కంఠ‌..సామాజిక స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన విష‌యాల్ని కోర్ట్ రూమ్ డ్రామాగా హైలైట్ చేయ‌నున్నారు. ఆరేళ్ల త‌ర్వాత కొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'భూల్ భూల‌య్య' రెండు భాగాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. అనీస్ బ‌జ్మీ తెర‌కెక్కించిన సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని యంగ్ అల‌రించారు హీరో కార్తిక్ ఆర్య‌న్.

ఈ నేప‌థ్యంలో మూడ‌వ భాగంలోనూ కార్తీక్ రూహ్ బాగా మెప్పించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్ట్రిప్ట్ ప‌నుల జ‌రుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సినిమా సెట్స్ కి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. ఈప్రాజెక్ట్ కోసం అనీస్-కార్తీక్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు.