Begin typing your search above and press return to search.

2023 లో ఇందిర‌మ్మగా ఇద్ద‌రు భామ‌లు!

2023 లో ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌లు మాజీ ప్ర‌ధాని ఇందిరాగాందీ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   11 Oct 2023 2:30 PM GMT
2023 లో ఇందిర‌మ్మగా ఇద్ద‌రు భామ‌లు!
X

2023 లో ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌లు మాజీ ప్ర‌ధాని ఇందిరాగాందీ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారా? పాత్ర కోసం ఎవ‌రికి వారు ది బెస్ట్ అనిపించుకోవాల‌ని చూస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'ఎమ‌ర్జెన్సీ 'తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందిరాగాంధీ 1975-77 కాలం నాటి ప‌రిస్థితుల్ని ఆధారంగా చేసుకుని కంగ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాలు పెంచేసాయి. ఇదీరాగాంధీ పాత్ర‌లో కంగ‌న ఆహార్యం అదిరిపోయింది. అచ్చంగా ఇందిర‌గాంధీనే త‌ల‌పించింది. ఇంకా సినిమా నుంచి ట్రైల‌ర్ లాంటి అస‌లైన స్ట‌ప్ రిలీజ్ కావాల్సి ఉంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తి చేయాలి. కానీ కంగ‌న మ‌ధ్య‌లో వేరే సినిమాలు కూడా క‌మిట్ అవ్వ‌డంతో ప్రాజెక్ట్ డిలే అవుతుంది.

అయితే ఆల‌స్య‌మైనా చెప్పిన స‌మ‌యానికే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముదుకు తీసుకురావ‌డానికి వేగంగా స‌న్నాహాలు చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి న‌వంబ‌ర్ 24న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇదే ఏడాది బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫాతిమా స‌నా కూడా ఇందిరాగాంధీ పాత్ర‌లో అల‌రించ‌నున్నారు. మేఘ‌నా గుల్జ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'సామ్ బ‌హ‌రూర్' లో ఫాతిమా ఇందిర పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా మంది నటీమ‌ణుల్నీ ప‌రిశీలించి చివ‌రిగా ఫాతిమాని ఎంపిక చేసారు.

ఆమె ముఖం ఇందిరమ్మ ఆహార్యానికి సెట్ అవుతుంద‌ని ఫాతిమాని తీసుకున్నారు. అంత‌కు ముందు కొన్ని బ‌యోపిక్ ల్లో న‌టించిన అనుభవం కూడా ఉండ‌టంతో ఫామితా అయితేనేఆ పాత్ర‌కి న్యాయం చేస్తుంద‌ని భావించారు. ఆ పాత్ర‌పై ఫాతిమా కూడా చాలా న‌మ్మ‌కంగా ఉంది. ఈ సినిమాతో అమ్మ‌డికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు షూటింగ్ శ‌ర వేగంగా పూర్తిచేస్తున్నారు.