బాలీవుడ్ చీప్ ట్రిక్స్.. ఇలానే కొనసాగిస్తే పతనమే!
అయితే ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు
By: Tupaki Desk | 26 July 2023 2:30 AM GMTతమ సినిమాను చూసేలా ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం కోసం ఆయా చిత్రబృందాలు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తుంటాయి. అవన్నీ ప్రమోషన్స్‌లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రచార చిత్రాల విడుదలలు, ఈవెంట్లు, టూర్లు, కాంటెస్టులు... ఇలా బోలెడంత హంగామా చేస్తుంటాయి మూవీటీమ్స్. మా చిత్రంలో కొత్త కథ ఉందని చెప్పడంతో మొదలుకొని.. అవసరమైతే రిలీజ్ తర్వాత అదనంగా మరి కొన్ని సీన్స్, సాంగ్స్‌ను కలపడం వరకు ప్రతిదీ.. ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసమే.
అయితే ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు.. బాలీవుడ్ ఈ మధ్య కొత్త దందా మొదలుపెట్టింది. తమ సినిమా థియేటర్లో చూసేందుకు, అదనంగా మరికొన్ని టికెట్లు తెగడం కోసం ఓ కొత్త పంథాను ప్రారంభించింది. అదేంటంటే.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. సినిమాను ప్రమోట్ చేసేందుకు ఆ చిత్రాల టికెట్లను భారీ స్థాయిలో మరొకరు కొనుగోలు చేయడం, ఫ్రీగా టికెట్లను పంచడం, ఒకటి కొంటే ఇంకొకటి ఇవ్వడం, టికెట్ల రేట్లలో రాయితీలు ఇవ్వడం కాస్త ఎక్కువగానే చేస్తున్నారు.
మరో మూడు రోజుల్లో రణ్వీర్-ఆలియా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ కహాని చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం 50 వేల టికెట్లను.. ప్రముఖ సంస్థలైన కజారియా, పెప్సీ బ్రాండ్లు కొనుగోలు చేశాయి. వీకెండ్లో ఈ టికెట్లను ఫ్రీగా పంచుతున్నట్లు తెలుపుతూ తమ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ కోసం ఫ్రీగా టికెట్లను పంచనుంది మూవీటీమ్.
అంతకుముందు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విషయంలోనూ ఇలానే జరిగింది. వేల కొద్ది టికెట్లను బయట సంస్థలు కొనుగోలు చేసి సినిమాను ప్రమోట్ చేశాయి. కార్తిక్ ఆర్యన్ షెహజాదా సినిమాకైతే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అనే ఆఫర్‌ను ప్రకటించాయి. కానీ ఈ చిత్రాలు ఇన్ని బంఫర్ ఆఫర్స్ ప్రకటించినా ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.
అదే సమయంలో గతవారం ఇక్కడ రిలీజైన హాలీవుడ్ సినిమాలు ఓపెన్‌హెయిమర్, బార్బీ చిత్రాలు భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి. పైగా వీటి టికెట్ ధరలు కూడా వేలల్లోనే ఉన్నాయి. అయినా ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. అంతకముందు షారుక్ పఠాన్ కోసం ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదు. అయినా ఆ చిత్రం ఏకంగా రూ.1000 కోట్లు కొల్లగొట్టింది. అంటే ఇక్కడ అంతిమంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే.. సినిమాలో కంటెంట్ ఎక్సైటింగ్ ఉంటే.. ఎలాంటి ఆఫర్స్‌తో సంబంధం లేకుండానే ఆటోమెటిక్‌గా సినిమా చూసేందుకు ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు.
కాబట్టి టికెట్స్‌పై ఆఫర్‌ను ప్రకటించడం, ఫ్రీగా పంచడం, అనవసరమైన ఎక్సైటింగ్ చీప్ ట్రిక్స్ ఆఫర్స్‌ను ప్రకటించి బాలీవుడ్.. తనంత తానే బాక్సాఫీస్ ఎకానమిక్ను(ఆర్థిక వ్యవస్థ) నాశనం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే బాలీవుడ్ ఇండస్ట్రీ ఎకనామీ దారుణంగా పడిపోతుందని, కుదేలవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి ఫ్రాడ్ కార్పరేట్ బుక్కింగ్స్ వంటి ప్రచారాలను మానుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే బాలీవుడ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. ఎక్సైటింగ్ ఆఫర్స్మీద దృష్టి పెట్టడం మానేసి ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్ ఉండేలా ఫోకస్ చేయాలని సూచిస్తున్నాయి.