నువ్వొక పోర్న్ కింగ్..నా గురించి మాట్లాడుతావా!
ఇన్ స్టా సంచలనం ఉర్పీజావెద్ డ్రెస్సింగ్ సెన్స్ పై శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Oct 2023 9:37 AM GMTఇన్ స్టా సంచలనం ఉర్పీజావెద్ డ్రెస్సింగ్ సెన్స్ పై శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు? అలాగే ఉర్పీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్ చేసారు. తాజాగా ఈ విషయం ఉర్పీ చెవిన పడటంతో అమ్మడు అంతెత్తున లేచి పడింది. తనదైన శైలిలో రాజ్ కుంద్రా కామెంట్కి ధీటైన బధులిచ్చింది.
'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తుల గురించి మాట్లాడుతాడా? క్షమించండి పోర్న్ కింగ్ అంటూ మండి పడింది. అమ్మడు తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రాజ్ కుంద్రా అనవసరంగా మళ్లీ పాత విషయాలు కెలికేలా చేస్తున్నాడంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఎవరి వ్యక్తిగత స్వేచ్చ వారికి ఉంటుంది.
ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఎదుట వారికి కామెంట్ చేసే హక్కులేదు. కానీ రాజ్ కుంద్రా అలా కామెంట్ చేసి దొరికిపోయాడు. భాయ్ నోరు జారాడు అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళల గురించి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు సార్ అంటూ సలహాలిస్తున్నారు. మరి ఈ వివాదంపై శిల్పా శెట్టి స్పందిస్తుందా? అన్నది చూడాలి.
రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో జైలుకెళ్లినప్పుడు శిల్పా శెట్టి ఆసక్తికర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తన భర్త తప్పు చేయలేదని..నిజాలు నిగ్గు తేల్తాయని..మహిళలంటే ఎంతో గౌరవించే వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఉర్పీ జావెద్ పై చేసిన కామెంట్ నేపథ్యంలో శిల్పాశెట్టి వ్యాఖ్యల్ని తవ్వి తీస్తున్నారు. ఇప్పుడు శిల్పా శెట్టి భర్త వైపు నిలబడుతుందా? ఓ మహిళగా ఉర్పీ జావెద్ కి మద్దతిస్తుందా? అన్నది చూడాలి.