జెన్ నెక్ట్స్ స్టార్స్ సుహానా- సారా టెండూల్కర్
గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్- క్రికెట్ ఐకాన్ లు సహా వారి కుమార్తెల సందడి హాట్ టాపిక్ గా మారింది
By: Tupaki Desk | 3 March 2024 7:17 AM GMTగుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్- క్రికెట్ ఐకాన్ లు సహా వారి కుమార్తెల సందడి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లిలో భవిష్యత్ తారల సందడి కూడా పెద్ద ఎత్తున కనిపించింది. బాలీవుడ్ లో కథానాయికగా తొలి అడుగులు వేస్తున్న కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు సుహానా ఖాన్.. మోడల్ గా మారిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు.
ఆ ఇద్దరూ ఈవెంట్లో వేర్వేరు సందర్భాల్లో దిగిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. సుహానా పూర్తిగా బ్లూ అండ్ బ్లూ లుక్ లో కనిపించగా, అందుకు భిన్నంగా సారా టెండూల్కర్ రెడ్ డిజైనర్ లెహంగాలో కనిపించింది. సుహానా అమితాబ్ మనవరాలు నవ్యనందా నవేళితో కలిసి కనిపించగా, సారా టెండూల్కర్ తన సన్నిహిత మిత్రులతో కలిసి కనిపించింది. ఎరుపు రంగు ముద్ద బంతి డ్రెస్ లో సారా నవ్వులు చిందిస్తున్న ఫోటోలు యువతరంలో వైరల్ గా మారుతున్నాయి.
ఆసక్తికరంగా అంబానీల పెళ్లిలో కింగ్ ఖాన్ షారూఖ్- సుహానా ఖాన్ డ్యాన్సింగ్ ప్రదర్శన ఒక హైలైట్ గా నిలిచింది. షారూఖ్ ఖాన్ తన ఆకర్షణీయమైన రూపంతో ఈవెంట్ లో వేడి పెంచారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరైన మూడు రోజుల కోలాహలంలో వేదికపై షారూఖ్ ఖాన్ అరుదైన ప్రదర్శనతో అలరించగా, అతడి కుమార్తె బ్లూ శారీలో ఎంతో అందంగా మనోహరంగా కనిపించి హృదయాలను గెలుచుకుంది.
SRK జై శ్రీ రామ్ నినాదం:
ఈ వేదికపై సొగసైన నలుపు రంగు కుర్తా, పైజామా ధరించి అలరించిన షారూఖ్ ఖాన్ ఉత్సాహంగా `జై శ్రీరామ్` అంటూ ఆశీర్వాదం కోరాడు. అతడు ఐక్యత ప్రార్థనల సారాంశాన్ని నొక్కి చెప్పాడు. పంజాబీ సంచలనం దిల్జిత్ దోసాంజ్ తన హిట్ పాట `లవర్`తో ప్రేక్షకులను అలరించగా.. షారుఖ్ ఖాన్, తన కుమార్తె సుహానా ఖాన్‌తో పాటు, నవ్య నవేలి నందా, అనన్య పాండే, షానాయ కపూర్‌లతో కలిసి వేడుకలో ఉల్లాసాన్ని పంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవనీయమైన అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్ , అలియా భట్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలను ఘనంగా మలిచారు.