పెళ్లిలో విజయ్ - రష్మిక.. హిందీ మీడియా అత్యుత్సాహం!
ఎందరు అతిథులు ఉన్నా `గీత గోవిందం` స్టార్లు విజయ్- రష్మిక పైనే అందరి కళ్లన్నీ. ఆ ఇద్దరూ ఈ వేదిక వద్ద సందడి చేసారు.
By: Tupaki Desk | 25 Feb 2024 10:53 AM GMTదిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ రెడ్డి -అద్విత రెడ్డిల వివాహ రిసెప్షన్ లో టాప్ టాలీవుడ్ సెలబ్రిటీల సందడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. ఈ పెళ్లిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా మెరిసిపోగా, విజయ్ దేవరకొండ - రష్మిక తదితరులు స్పెషల్ అప్పియరెన్సులు వెబ్‌లో హాట్ టాపిక్ గా మారాయి. రిసెప్షన్‌కు హాజరైన అతిథుల జాబితాలో నాగార్జున, నాగ చైతన్య, నాని, రామ్ పోతినేని సహా చాలా మంది ప్రముఖులు ఉన్నారు.
ఎందరు అతిథులు ఉన్నా `గీత గోవిందం` స్టార్లు విజయ్- రష్మిక పైనే అందరి కళ్లన్నీ. ఆ ఇద్దరూ ఈ వేదిక వద్ద సందడి చేసారు. అయితే తెలుగు మీడియా కంటే హిందీ మీడియాలో రష్మిక- విజయ్ జంటపై ఆరాలు ఎక్కువయ్యాయి. ఆ ఇద్దరూ జంటగా ఈ పెళ్లికి హాజరయ్యారంటూ ఒకటే ప్రచారం సాగిస్తున్నాయి హిందీ మీడియాలు. కానీ నిజానికి ఆ ఇద్దరూ ఎవరికి వారు విడివిడిగా ఈ పెళ్లికి అటెండయ్యారు. కానీ బాలీవుడ్ మీడియాలు మరోసారి క్రేజీ పెయిర్ అంటూ ప్రచారం సాగిస్తోంది.
విజయ్, రష్మిక డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉన్నారు. విజయ్, రష్మికల కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. తొలిసారి గీత గోవిందంలో, ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ వారు స్నేహితులుగా కొనసాగుతున్నారు.
అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రష్మిక విజయ్‌తో తన బంధం గురించి మాట్లాడింది. అతడిపై తనకు చాలా గౌరవం ఉందని చెప్పింది. విజు - నేను ఒకరకంగా కలిసి ఎదిగాము. కాబట్టి నేను ప్రస్తుతం నా జీవితంలో ఏ పని చేసినా అందులో అతడి సహకారం ఉంటుంది. నేను చేసే ప్రతి పనిలో తన సలహా తీసుకుంటాను. నాకు అతడి అభిప్రాయం కావాలి.. ప్రతిదానికి అతడు అవును అనడు. ఏది మంచి ఏది చెడు చెబుతాడు. నా మొత్తం జీవితంలో అందరికంటే ఎక్కువగా అతడు నాకు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చాడు. కాబట్టి విజయ్ నేను నిజంగా గౌరవించే వ్యక్తి`` అని అన్నారు.