రీల్ సీతారాముల మధ్య అలాంటి ఇబ్బంది లేదు!
రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం ఓ అచారంగా కొనసాగుతుంది
By: Tupaki Desk | 31 July 2024 9:30 AM GMTబాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా `రామాయణం` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కూర్... సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తోన్న చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఇక రామాయణం లో సీతారాముల కల్యాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీ రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం ఓ అచారంగా కొనసాగుతుంది.
అయితే ఇదే కథలో చిన్న గందరగోళం కూడా ఉంది. భార్యభర్తలైన సీతా-రాములలో సీత..రాముని కంటే పెద్దదని వాదన ఓవైపు ఉండగా....సీత కంటే రాముడు ఏడేళ్లు పెద్ద అన్న వాదన అంతే బలంగా ఉంది. సీత వనవాసానికి వెళ్లే సమయానికి సీతకి 18 ఏళ్లు కాగా, రాముడికి 25 ఏళ్లుగా రామాయనం చెబుతుంది. దీని ఆధారంగా వరుడు.. వధువుల పెళ్లి విషయంలో అమ్మాయి కంటే అబ్బాయి పెద్ద వయసు వాడై ఉండాలని చెబుతుంటారు.
ఇలా రామాయణం...నిజ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా పెళ్లికి..వయసుకు ఓ ప్రత్యేకత అనేది సంతరించుకుంది. అయితే రీల్ సీతారాముల మధ్య అలాంటి గందగోళం చోటు చేసుకోండా దర్శకుడు నితీష్ తివారీ ముందే అలెర్ట్ అయ్యాడు. రాముడి పాత్ర పోషిస్తోన్న రణబీర్ కపూర్ కి 41 ఏళ్లు కాగా, సీత పాత్రలో నటిస్తోన్న సాయి పల్లవికి 32 ఏళ్లు నిండాయి. దీంతో నితీష్ కథలో సీతా-రాముల మధ్య వయసు బేధమంటూ లేదు. అది సంప్రదాయంగా అబ్బాయి-అమ్మాయి మధ్య ఉండాల్సిన బేధమే.
ఆ రకంగా నితీష్ ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారు. లేదంటే ఇది వివాదానికి ఛాన్స్ లేకపోలేదు. అదే తక్కువ వయసున్న హీరో పాత్రని..ఎక్కువ వయసున్న హీరోయిన్ పాత్రని ఎంపిక చేసి ఉంటే రామాయణాన్ని వక్రికరిస్తున్నారనే విమర్శలు మోయాల్సి వచ్చేది. రామాయణం ప్రకారం చూస్తే రాముడి కంటే సీత చిన్నదే. కానీ దీనిపై భిన్న వాదనలున్న నేపథ్యంలో నితీష్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. కాబట్టి దర్శకుడు ఆ రకంగా ముందే సేఫ్ జోన్ లో ఉన్నట్లు. ఇలాంటి ఇతిహాసాల కథల నేపథ్యంలో విమర్శలు...వివాదాలు సహజమే.