కమర్షియల్ రీ'మేకు'.. ఛాన్స్ దొరికిందని టాలీవుడ్ పై పడ్డారు!
అయితే ఒక సినిమా రీమేక్ చూపించి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బాలీవుడ్ మీడియా వాళ్ళు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 17 Aug 2024 5:23 AM GMTఇతర భాషలలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలని తెలుగులో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా రీమేక్ సినిమాలకి తెలుగునాట పెద్దగా ఆదరణ లభించడం లేదు. అయిన కొంతమంది దర్శక, నిర్మాతలు మాత్రం రీమేక్ ల చుట్టూ తిరుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ హిందీ సినిమా తెలుగులో రీమేక్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ రీమేక్ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు.
పబ్లిక్ నుంచి కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. హిందీలో సీరియస్ గా నడిచే కథని తెలుగు ప్రేక్షకులకి చేరువ చేయాలని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయోగమే వికటించిందనే మాట వినిపిస్తోంది. ఒరిజినల్ కథని ఉన్నది ఉన్నట్లు చెప్పిన మూవీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేదనే టాక్ ఉంది.
మరోసారి ఇతర భాషా సినిమాలని రీమేక్ చేయడం సేఫ్ కాదనే విషయాన్ని ఈ మూవీ ప్రూవ్ చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమాలు ఫెయిల్యూర్ అయితే సంతోషించే బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అన్ని భాషలలో సత్తా చాటుతున్నాయి. హిందీలో కూడా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి.
బాలీవుడ్ క్రిటిక్స్ ముసుగులో కొంతమంది ఆ సినిమాలపై ఎంతగా దుష్ప్రచారం చేసిన ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తున్నారు. అయితే దీనిని తట్టుకోలేని వారు ఇప్పుడు రీమేక్ గా తెరకెక్కిన సినిమాపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఇండియాలో అత్యంత చెత్త పరిశ్రమ టాలీవుడ్. మంచి సినిమాలని రీమేక్ చేసి నాశనం చేయడం ఎలాగో టాలీవుడ్ నిర్మాతలకి బాగా తెలుసు అంటూ ఓ మీడియా ప్రతినిధి ట్వీట్ చేశారు.
అయితే ఒక సినిమా రీమేక్ చూపించి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బాలీవుడ్ మీడియా వాళ్ళు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. చెత్త అంటున్న అదే టాలీవుడ్ నుంచి ఏకంగా మూడు 1000 కోట్ల కలెక్షన్స్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అలాగే అదే తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుందని గుర్తుంచుకుంటే మంచిది అంటూ తెలుగు సినిమా అభిమానులు బాలీవుడ్ క్రిటిక్స్ కామెంట్స్ పై విమర్శలు చేస్తున్నారు.