Begin typing your search above and press return to search.

యాత్ర 2: బాబు క్యారెక్టర్ కోసం బాలీవుడ్ విలన్!

కానీ దర్శకుడు మహి ఎక్కడ కూడా అంచనాలను తగ్గకుండా సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 6:33 AM GMT
యాత్ర 2: బాబు క్యారెక్టర్ కోసం బాలీవుడ్ విలన్!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఇప్పుడు ఆ హీట్ లో సినిమాలు కూడా ప్రభావం చూపబోతున్నాయి. గత ఎన్నికల సమయంలో రెండు ఆగ్ర పార్టీలకు సంబంధించిన సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా యాత్ర సినిమా కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపించింది అనేలా కామెంట్స్ అయితే వచ్చాయి.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. మహీ వి రాఘవ ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడు యాత్ర 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ గా జగన్ జీవిత ఆధారంగా ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ వచ్చేసింది.

ఇక జగన్ పాత్ర కోసం చాలామంది హీరోలను కూడా సంప్రదించారు అని కథనాలు వెలువడ్డాయి. అయితే తమిళ హీరో రంగం ఫేమ్ జీవా వైఎస్ జగన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇక ఈ కాంబినేషన్ పై కొంత బజ్ అయితే క్రియేట్ అయింది. అయితే యాత్ర 2 సినిమాలో మిగతా రియల్ క్యారెక్టర్స్ ను ఏమైనా చూపిస్తారని డౌట్స్ అయితే చాలా వచ్చాయి.

ఇక చంద్రబాబు పాత్ర కోసం అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నటుడు బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు లోనే చాలా రకాల నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాలో నటిస్తున్నారు అనే విషయం అయితే మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. చంద్రబాబు పాత్రను దర్శకుడు ఏ విధంగా చూపిస్తాడు బాబు నిజజీవితంలోని నడవడికకు తగ్గట్టుగా మహేష్ ఎలా నటిస్తాడు అనేది ఆసక్తి గా మారింది.

కానీ దర్శకుడు మహి ఎక్కడ కూడా అంచనాలను తగ్గకుండా సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం కేవలం స్టార్ క్యాస్టింగ్ మాత్రమే కాకుండా టాప్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈ సినిమా ప్రొడక్షన్లో ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్. తప్పకుండా సినిమాను గ్రాండ్ గానే విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక యాత్ర 2 వచ్చే ఎన్నికల కంటే ముందు 2024 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల కానుంది.