హైకోర్ట్ తీర్పుతో పాక్ నటీమణులను ఆపలేం!
బాంబే హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది సినీరంగానికి సంబంధించిన కీలకమైన కేసు.
By: Tupaki Desk | 21 Oct 2023 2:30 AM GMTబాంబే హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది సినీరంగానికి సంబంధించిన కీలకమైన కేసు. వివరాల్లోకి వెళితే.. నటులు, గాయకులు, సంగీతకారులు, గీత రచయితలు, సాంకేతిక నిపుణులు వంటి పాకిస్థానీ కళాకారులతో భారతీయ పౌరులు, కంపెనీలు సంఘాలు సహకరించకుండా పూర్తిగా నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ సునీల్ బి షుక్రే, జస్టిస్ ఫిర్దోష్ పి పూనివాలా అధ్యక్షత వహించిన న్యాయస్థానం పిటిషన్ ని విచారించింది. సాంస్కృతిక సామరస్యం, ఐక్యత, శాంతిని ప్రోత్సహించడంలో తిరోగమన దశ అని ఇలాంటి కేసు అర్హత లేనిదని ప్రకటించింది.
పిటిషనర్ ఒక సినీ కార్మికుడు. పాకిస్థానీ కళాకారులపై నిషేధం సహా వీసాలపై నియంత్రణ విధించేలా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే భారత్‌లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనేందుకు అనుమతించడం వంటి అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించడంలో భారత ప్రభుత్వం తీసుకున్న 'సానుకూల చర్యలు' అటువంటి పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకుంటే బలహీనపడతాయని కోర్టు పేర్కొంది. లైవ్ లా ద్వారా కోట్ చేసారు. కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి , నృత్యం సహా శాంతి, సామరస్యం, ప్రశాంతతను పెంపొందించే కార్యకలాపాలు జాతీయ సరిహద్దులను దాటి, దేశాల మధ్య .. దేశాల మధ్య ఐక్యత సామరస్యానికి దోహదం చేస్తాయని కోర్టు పేర్కొంది.
సెప్టెంబరు 2016లో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) 'యూరి' దాడి తరువాత భారతీయ సినీ పరిశ్రమ నుండి పాకిస్తానీ నటులను నిషేధించాలనే తీర్మానాన్ని ఆమోదించింది. IMPPA ప్రెసిడెంట్ TP అగర్వాల్ ఇలా అన్నారు. IMPPA వారి 87వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్థానీలు ఎప్పటికీ తమ నిర్మాతల సంఘం సభ్యులచే నియమించకూడదనే తీర్మానాన్ని ఆమోదించారు.
విధానపరమైన ఆదేశాలను రూపొందించడానికి పిటిషనర్ చేసిన ప్రార్థనలు దాని పరిధికి మించినవి అని కోర్టు నిర్ధారించింది. ఎందుకంటే నిర్దిష్ట పద్ధతిలో విధానాలను రూపొందించమని ప్రభుత్వం లేదా శాసనసభను ఆదేశించలేము. కాబట్టి లైవ్ లా ప్రకారం పిటిషన్ ని కొట్టివేసారు.
ఇండో పాక్ సరిహద్దుల నుండి వచ్చిన నటుల్లో ఫవాద్ ఖాన్ ధర్మ ప్రొడక్షన్స్- కపూర్ అండ్ సన్స్‌లో రెండు పెద్ద సినిమాల్లో నటించారు. ఏ దిల్ హై ముష్కిల్ ఇందులో ఒకటి. మహీరా ఖాన్ షారుఖ్ ఖాన్ రయీస్‌లో నటించారు. అతిఫ్ అస్లాం .. రహత్ ఫతే అలీ ఖాన్ వంటి గాయకులు గతంలో భారతీయ చిత్రాలకు పాడారు. పాకిస్తాన్ లో కింగ్ ఖాన్ షారూఖ్ ని గొప్పగా అభిమానించే ఒక వీరాభిమాని నిరంతరం ఖాన్ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటారు.