Begin typing your search above and press return to search.

దేవి మైత్రి బంధం ఎంత సూపర్ హిట్టంటే..

దేవి, మైత్రి మూవీ మేకర్స్ మధ్య కలయిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:03 PM GMT
దేవి మైత్రి బంధం ఎంత సూపర్ హిట్టంటే..
X

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ మధ్య రెగ్యులర్ కాంబినేషన్స్ కు దురమవుతున్నాడు అనేలా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు అన్నీ తానై చూసుకునే దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మెప్పించలేదని మరో ఇద్దరిని తీసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ సంగతులు ఎలా ఉన్నా కూడా దేవి మైత్రి బాండింగ్ లో ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేదు. దేవి, మైత్రి మూవీ మేకర్స్ మధ్య కలయిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది.

ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీటిలో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అన్నీ బ్లాక్‌బస్టర్ లేదా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇది తెలుగు సినీ చరిత్రలో అరుదైన రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఈ కలయికను మహేష్ బాబు నటించిన శ్రీమంతుడుతో ప్రారంభించారు. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లోనే ఒక గొప్ప మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచింది.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మరో సంచలన విజయాన్ని నమోదు చేశారు. రామ్ చరణ్ రంగస్థలంతో దేవిశ్రీ పాటలు, బీజీఎమ్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ కలయికలో వచ్చిన చిత్రలహరి పాటలు యూత్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఉప్పెన సినిమాతో దేవి సంగీతం విన్నవారిలో ఒక ఊపు తెచ్చింది. ఈ చిత్రం పాటలు కథలో కీలక పాత్ర పోషించాయి.

అయితే, మైత్రి-డీఎస్పీ కలయికలో పుష్ప ది రైజ్ గొప్ప మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా బన్నీకి, దేవికి నేషనల్ అవార్డును తీసుకొచ్చింది. ఇక రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు దేవి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ కలయికలో పుష్ప 2 ది రూల్ మరో పెద్ద విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.

సాంగ్స్ విడుదల కాగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించాయి. ఇక బీజీఎమ్ విషయంలో తొలిదశలో వివాదాలు తలెత్తినా, టైటిల్ క్రెడిట్స్‌లో డీఎస్పీ పేరు స్పష్టంగా ఉండడంతో అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఈ కలయిక తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భారీ చిత్రాలు కూడా మైత్రి-డీఎస్పీ చేతుల్లో ఉన్నాయంటే ఈ బంధం మరింత ప్రత్యేకమవుతుందని చెప్పవచ్చు. ఇలాంటి చిత్రాల విజయాలు మైత్రి మూవీ మేకర్స్, డీఎస్పీ ప్రతిష్టను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. దేవి, మైత్రి కలయికలో మరిన్ని విజయాలు చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఇంకా ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.