6 నెలలు అదే పనిగా హీరోయిన్ వెంటపడ్డ అగ్ర నిర్మాత
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను! అని ఆ హీరోయిన్ కి ప్రపోజ్ చేసాడు.
By: Tupaki Desk | 29 Dec 2024 12:30 AM GMTఅతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అందమైన భార్య ఉంది. కానీ ఏం చేయగలడు? సెట్లో అతిలోక సుందరిని చూశాక వెంటనే ప్రేమలో పడిపోయాడు. తనకు పెళ్లయిందని కానీ, పిల్లలున్నారని కానీ ఆ క్షణం గుర్తుకు రాలేదు. అంతగా ఆ హీరోయిన్ తన అందం, ప్రతిభతో మైమరిపించింది. దీంతో నిండా ప్రేమలో మునిగాడు పాపం పసోడు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను! అని ఆ హీరోయిన్ కి ప్రపోజ్ చేసాడు. ఒకసారి రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరు నెలలు తన వెంటే తిరిగాడు. పదే పదే అతడిని తప్పించుకుంటూ ఆ హీరోయిన్ ఏం చేయాలో తెలియని డైలమాలో పడిపోయింది. నీకు పెళ్లయింది పిల్లలున్నారు ఇదేం పాడు బుద్ధి? అంటూ అతడిని తిట్టేసింది కూడా. అతడు ఎంత వెంటపడుతుంటే అంతగా తప్పించుకోజూసింది. కానీ చివరికి అతడు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి తనను ఒప్పించాడు. వన్ ఫైన్ డే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత కథంతా తారుమారు!
ఈ మొత్తం ఎపిసోడ్ లో హీరోయిన్ వెంట పడ్డ అగ్ర నిర్మాత పేరు బోనీ కపూర్. అలనాటి మేటి కథానాయిక, అతిలోక సుందరి శ్రీదేవి వెంటపడ్డ అతడు చివరికి ఒప్పించి పెళ్లాడాడు. కానీ ఈ పెళ్లితో అతడి మొదటి భార్య, కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. అతడికి పిల్లలు దూరమయ్యారు. బోనీ కపూర్ కి అప్పటికే సినీనిర్మాత మోనా శౌరితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ప్రేమ పేరుతో పెడదారి పట్టాడు. శ్రీదేవితో వార్నింగులు ఎదుర్కొన్నాడు. కానీ తన ప్రేమలో నిజాయితీ చివరకు గెలిచింది. శ్రీదేవి నెలల తరబడి అతడిని తప్పించుకుని తిరిగింది. తనను ఒప్పించడానికి నాకు 4, 6 సంవత్సరాలు పట్టిందని బోనీ చెప్పాడు. . ``నీకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు.. నాతో ఇలా ఎలా మాట్లాడగలవు? అని కూడా శ్రీదేవి వార్నింగ్ ఇచ్చిందని చెప్పాడు.
శ్రీదేవితో లవ్ లో ఉన్నప్పుడు తన భార్య మోనాకు బోనీ ఫీలింగ్స్ గురించి తెలుసట. తర్వాత కుటుంబంలో కలతలు వచ్చాయి. వారు విడాకులు తీసుకున్నారు. 2018లో శ్రీదేవి విషాదకర మరణం తర్వాత బోనీ తీవ్రంగా దిగాలైపోయాడు.