Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో క‌లిసి మందు కొట్టాన‌న్న అగ్ర నిర్మాత‌

ప్ర‌ముఖ హీరోతో క‌లిసి మందు కొట్టాన‌ని, పెగ్గు ఒలికించాన‌ని బాహాటంగా చెప్పారు అగ్ర‌నిర్మాత‌.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:30 PM GMT
స్టార్ హీరోతో క‌లిసి మందు కొట్టాన‌న్న అగ్ర నిర్మాత‌
X

ప్ర‌ముఖ హీరోతో క‌లిసి మందు కొట్టాన‌ని, పెగ్గు ఒలికించాన‌ని బాహాటంగా చెప్పారు అగ్ర‌నిర్మాత‌. అత‌డికి ఖ‌రీదైన మందు బాటిల్ లేనిదే నిదురే ప‌ట్ట‌ద‌ని కూడా సెల‌విచ్చారు. మందు ముట్ట‌నిదే ఆయ‌న ముందుకు వెళ్ల‌రు. ఏ ప‌నీ చేయ‌లేరు. అలాంటిది ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ త‌న సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో మందు ముట్ట‌డం మానేశార‌ని కూడా తెలిపారు. సినిమా చిత్రీక‌ర‌ణ, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నుంచి తొలి కాపీ బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ.. చివ‌రికి రిలీజ్ ద‌శ‌కు వ‌చ్చే వ‌ర‌కూ ఏనాడూ మందు ముట్ట‌ని రియ‌ల్ హీరో అయ్యార‌ని కూడా అగ్ర‌నిర్మాత కితాబిచ్చారు. అంతేకాదు.. అత‌డితో క‌లిసి ఖ‌రీదైన మ‌ద్యం ఒలికించిన అనుభ‌వంతో చెబుతున్నాను. అత‌డితో క‌లిసి పెగ్గు క‌లిపిన ఏకైక వ్య‌క్తిగా చెప్ప‌గ‌ల‌ను అని కూడా తెలిపారు.

ఈ ఎపిసోడ్ లో ప్ర‌ముఖ హీరో ఎవ‌రు? అంటే... వెట‌ర‌న్ స్టార్ రాజ్ క‌పూర్. దిగ్గజ రాజ్ కపూర్ జన్మ శతాబ్ది వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అగ్ర నిర్మాత బోనీక‌పూర్ పై విష‌యాల‌న్నీ బాహాటంగా వెల్ల‌డించారు. ఓ ఇంట‌ర్వ్యూలో బోనీ మాట్లాడుతూ.. క‌పూర్ తో స్వీట్ మెమ‌రీస్ ని షేర్ చేసారు.

ఐదు దశాబ్దాల పాటు న‌టుడిగా కొనసాగిన రాజ్ క‌పూర్ ప్రతి దశాబ్దంలో బ్లాక్ బస్టర్ లు అందించిన ఏకైక న‌టుడు-ఫిలింమేక‌ర్‌, ఎడిటర్, గొప్ప ద‌ర్శ‌క‌నిర్మాత అని కీర్తించారు. అతడు ట్రెండ్‌ను పట్టుకున్నాడు.. ట్రెండ్‌లను సృష్టించాడు.. కాలంతో పాటు మారాడు. సినిమాలను మాత్రమే తినడం, తాగడం, శ్వాసించ‌డం అలవాటు చేసుకున్నాడు. అతడిలా ఎవరూ లేరు.. ఎప్పటికీ ఉండరు. అతడు ప్రతి దశాబ్దంలో పెరిగాడు. అది అతడిని ఒక లెజెండ్ ని చేసింద‌ని ఉద్వేగంగా మాట్లాడారు బోనీ. అత‌డి ఆలోచ‌న‌లు అడ్వాన్స్ డ్ గా ఉండేవి. త‌న టైమ్ కంటే చాలా ముందుండేవ‌ని కూడా బోనీ విశ్లేషించారు. క‌పూర్ సాబ్ న‌టించిన‌ ప్రేమ్ రోగ్, బాబీ ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటాయ‌ని అన్నారు.

కపూర్ జీ త‌న కెరీర్ లో గెలుపోట‌ములు రెండిటినీ ఎదుర్కొని ముందుకు సాగార‌ని అన్నారు. మేరా నామ్ జోకర్ చిత్రంపై ఆయ‌న‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే అది మొదట్లో బాగా ఆడలేదు.. తరువాత అది బాగా వ‌సూలు చేయడం ప్రారంభించింది. రెండోసారి మూడో సారి రిలీజ్ చేసిన‌ప్పుడు మ‌నీ స్పిన్నర్ గా మారింది. అతను సినిమాను మళ్లీ ఎడిట్ చేశాడు. తాగుడు అంటే అంతగా ఇష్టపడే వ్యక్తి సినిమా చివరి దశలో ఉండగానే దాన్ని వదులుకునేవాడు. కాపీ బయటకు వచ్చే వరకు అతడు ఆ కాలంలో ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పీరియడ్ మొత్తం తాగకుండానే గడిచిపోయింది. అత్యంత ఖరీదైన ఆల్కహాల్ బాటిల్ ని అత‌డితో షేర్ చేసుకునే ఏకైక‌ వ్యక్తిని నేను కాబట్టి నాకు దీని గురించి బాగా తెలుసున‌ని బోనీ అన్నారు.